'వారి సమ్మెతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కదలిక'
కరీంనగర్: సింగరేణి కార్మికుల సమ్మెతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కదలిక వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరిఖనిలో ఏర్పాటు చేసిన సింగరేణికాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ ప్రథమ సర్వసభ్యసమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన పైవిధంగా వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో సింగరేణి కార్మికులకు ఎడాపెడా హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక వాటిని విస్మరించారని తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయకుండా వాళ్ల జీవితాలతో ఆడుకుంటాన్నారన్నారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల సమస్యలను వచ్చే అసెంబ్లీ సమావేశాల సమయంలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.