కార్మికుల్లో చిగురిస్తున్న ఆశలు
సీఎం ప్రకటనతో డిస్మిస్ కార్మికుల్లో ఆనందం వారసత్వ ఉద్యోగాలపై హర్షం
శ్రీరాంపూర్ : తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటనతో సింగరేణిలో ఆశలు చిగురిస్తున్నాయి. గురువారం ఓ మీడియా ఇంటర్వ్యూలో సింగరేణి సమస్యలను ప్రస్తావిం చారు. వారసత్వ ఉద్యోగాలు వంద శాతం ఇప్పిస్తామని, డి స్మిస్ కార్మికులను తిరిగి తీసుకుంటామని ప్రకటించారు. వీటి పై సింగరేణిలో సర్వత్రా చర్చ జరుగుతోంది. బాయిల్లో మస్ట ర్ పడిన దగ్గర నుంచి గులాయిల్లో పనిచేసేటప్పుడూ కార్మికులు ఇవే అంశాలపై చర్చించుకుంటున్నారు.
సాక్షాత్తు ము ఖ్యమంత్రి నోటి వెంట హామీ రావడంతో సమస్యలు పరి ష్కారం కానున్నాయని ఈ రెండు వర్గాలకు చెందిన కార్మికు లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సింగరేణిలో ఒకప్పుడు వారస త్వ ఉద్యోగాలు ఉండేవి. కార్మికుడికి పనిచేత కాకపోయినా, మరే ఇతర కారణాలతోనైనా వీఆర్‌ఎస్ తీసుకుని తన స్థానం లో కొడుకు, కూతురు, అల్లుడుకో ఉద్యోగం రాసిచ్చేవారు. దీంతో ఆ ఇంట్లో ఎవరో ఒకరు వారసత్వంగా ఉద్యోగం చేసేవారు.
కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న హ క్కుల్లో ఇది ప్రధానమైనది. కంపెనీలో ఆర్థిక సంస్కరణల కా రణంగా 1996 నుంచి వారసత్వ ఉద్యోగాలు రద్దయ్యాయి. జాతీయ సంఘాల నిర్వాకం కూడా కొంత కారణంగా చెప్పవచ్చు. వారసత్వ ఉద్యోగాలు అర్ధంతరంగా నిలిచిపోవడంతో వాటినే నమ్ముకుని చదువు మధ్యలో ఆపేసిన చాలామంది కార్మికుల పిల్లలు నిరుద్యోగులుగా మారారు.
డిపెండెంట్ ఉద్యోగం కోసం లక్షలు కుమ్మరించి..
ఏదైనా ప్రమాదం జరిగి క్షతగాత్రులైనా, గుండెజబ్బు, కిడ్నీ, బీపీ సమస్యలు, ఇతర ఏ అనారోగ్య సమస్య ఉత్పన్నమైనా మెడికల్ రూల్స్ ప్రకారం అతడు డ్యూటీ చేయడం కుదరదని తేలితే కంపెనీ మెడికల్ బోర్డు సదరు కార్మికుడిని మెడికల్ అన్‌ఫిట్ చేస్తుంది. దీని కింద డిపెండెంట్‌కు ఉద్యోగం వస్తుంది. డిపెండెంట్ ఉద్యోగానికి ఇదొక్కటే దారి. చాలామంది సర్వీసు దగ్గరపడి గనిలో పని విధానానికి తట్టుకోలేక రకరకాల జబ్బుల బారిన పడుతున్నారు.
కీళ్లు అరిగిపోయి నడవలేక ఉన్నవారు, ఇతర అనారోగ్యంతో బాధపడుతున్నవారు తమను అన్‌ఫిట్ చేయాలని ఆస్పత్రుల వెంట తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. కానీ.. కార్మికులు దళారుల వద్దకు వెళ్లి రూ.మూడు నాలుగు లక్షలు చదివించుకుంటే వెంటనే మెడికల్ అన్‌ఫిట్ చేస్తున్నారు. కొడుకుకు ఉద్యోగం వస్తుందనే ఆశతో చాలామంది దళారులను ఆశ్రయిస్తున్నారు. దళారుల్లో ఎక్కువమంది యూనియన్ల లీడర్లే కావడం గమనార్హం.
చాలామంది డిపెండెంట్ ఉద్యోగం కోసం లక్షలు దారపోసి మెడికల్ అన్‌ఫిట్ బాట పడుతున్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీ నెరవేరితే సమస్య తీరుతుంది. కార్మికుడే తన ఉద్యోగాన్ని తన కొడుకుకు ఇవ్వాలని కాగితంపై రాసి గని మేనేజర్‌కు ఇచ్చి వీఆర్‌ఎస్ పెట్టుకుంటే చాలు నేరుగా ఉద్యోగం వస్తుంది. పైసా ఖర్చు లేకుండా కొడుకు ఉద్యోగం వస్తుంది.
త్వరగా అమలు చేస్తే మేలు..
కంపెనీలో చాలామంది కార్మికులు రిటైర్మెంట్‌కు దగ్గరగా ఉన్నారు. మరో మూడేళ్లలో సుమారు 15వేల మంది రిటైర్మెంట్ కానున్నారు. వారసత్వ ఉద్యోగ హక్కు కల్పిస్తే వారందరికీ మేలు జరుగుతుంది. దీనికి తోడు కంపెనీలో ఉద్యోగుల కొరత రెండు మూడేళ్లలో ఏర్పడబోతోంది. రిటైర్మెంట్‌తో ఖాళీ అయ్యే పోస్టులను వారసత్వ ఉద్యోగాలతో భర్తీ చేయాలని కోరుతున్నారు.
డిస్మిస్ కార్మికులకు పునర్జీవం..
కంపెనీ నిబంధనల ప్రకారం.. మస్టర్ల సంఖ్య తక్కువగా ఉండి చాలామంది కార్మికులు డిస్మిస్ అయ్యారు. 1994 నుంచి ఏడాదికి వంద మస్టర్లు చేయని వారిని ఉద్యోగాల్లో నుంచి తొలగించడం మొదలుపెట్టారు. అలా ఇప్పటివరకు సుమారు 6 వేల మంది నాగాల కారణంగా డిస్మిస్ అయ్యారు. ఇప్పటికిప్పుడు ఉద్యోగం ఇస్తే పనిచేయడానికి సుమారు 1500 మంది సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి అవకాశం ఇవ్వాలని సింగరేణి వ్యాప్తంగా చేసిన పోరాటాలతో యాజమాన్యం దిగివచ్చి కొద్దిమందిని విధుల్లోకి తీసుకుంది. 2000 సంవత్సరంలో హైపవర్ కమిటీ డిస్మిస్ అయిన వారిలో అనారోగ్య కారణంగా డ్యూటీలు చేయలేదని నిర్దారించిన 66 మందిని విధుల్లోకి తీసుకున్నారు.
మే 2004లో 85 మందిని తీసుకున్నారు. ఇంకా పెద్దయెత్తున డిస్మిస్ కార్మికులు ఉండడంతో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో పలు సంఘాలు వారికి మద్దతుగా నిలిచాయి. అనంతరం యాజమాన్యం మళ్లీ ఏప్రిల్ 2012లో హైపవర్ కమిటీ ఏర్పాటు చేసింది. నిబంధనలు కఠినతరం చేసి 2,249 మందిని కౌన్సెలింగ్‌కు పిలిచి వారిలో 66 మందికే ఉద్యోగాలు ఇచ్చారు. దీనిపై లోకాయుక్తకు వెళ్లడంతో మరో 420మందిని తీసుకున్నారు.
ఇవీ హామీలు..
* 2012 జూన్ 28న జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అనుబంధ సంఘం టీబీజీకేఎస్ తాము గెలిస్తే వారసత్వ ఉద్యోగాలు, డిస్మిస్ కార్మికులకు తిరిగి ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ హామీనిచ్చింది.
* సార్వత్రిక ఎన్నికల్లో ఈ రెండు అంశాలు టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా ఉన్నాయి.
* మందమర్రి, శ్రీరాంపూర్, గోదావరిఖనిలో జరిగిన ఎన్నికల బహిరంగ సభల్లో కేసీఆర్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే వాటిని సాధించి పెడతామని పేర్కొన్నారు.