సాయం రాదన్న బెంగతో ఆరుగురు మృతి
సాక్షి నెట్‌వర్క్: జీవితానికి ఆసరాగా ఉంటుందనుకున్న పథకం అందుకుందో.. లేదోనన్న బెంగతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు వివిధ జిల్లాల్లో నలుగురు చనిపోయారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్దపల్లికి చెందిన నాయినిపల్లి కృష్ణయ్య(62), పాన్‌గల్ మండలం జమ్మాపూర్ వాసి కుర్వ రామచంద్రయ్య(80)లకు ఆధార్‌కార్డులో ఉన్న వయస్సు ఆధారంగా పింఛన్లు రద్దు చేశారు. దీంతో కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతకు గురైన వీరు వారం రోజులుగా మంచం పట్టారు. శనివారం రాత్రి చనిపోయారు. ఇదే జిల్లానారాయణపేటకు చెందిన కొనంగేరి సీతమ్మ(71) పింఛన్ జాబితాలో పేరు లేకపోవడంతో మనస్తాపం చెంది ప్రాణాలు వదిలింది.
అలాగే ఆదిలాబాద్ జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి చెందిన కొడిమెల మల్లక్క(72) నలుగురు కొడుకులున్నా.. ఒంటరిగానే జీవిస్తోంది. శనివారం గ్రామంలో అధికారులు పింఛన్లు పంపిణీ చేశారు. తనకు పింఛన్ రాకపోవడంతో అధికారులను ప్రశ్నించగా, మరో జాబితాలో వస్తుందని దాటవేశారు. పించన్ రాలేదని ఏడుస్తూ ఇంటికి వచ్చి గుండెపోటుకు గురైంది. కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ మండలం పందిల్లకు చెందిన తాడూరి మణెమ్మ(50)కి వితంతు పింఛన్ వచ్చేది. ఇటీవల ప్రకటించిన జాబితాలో ఆమె పేరు లేదు. ఇక తనకు పించన్ వస్తుందో రాదోనన్న బెంబతో గుండె ఆగి మరణించింది. ఇదే జిల్లా ఇల్లంతకుంట మండలం వంతడ్పులకు చెందిన సావనపెల్లి హన్మయ్య(72) వికలాగుండు. ధ్రువీకరణలు సరిగా లేకపోవడంతో వృద్ధాప్య పించన్ మంజూరైంది. తనకు వికరాలంగ పింఛన్ రాదనే ఆదివారం గుండెపోటుతో చనిపోయాడు.
ప్రాణాలు తీస్తున్న పింఛన్..
Published Mon, Dec 8 2014 1:05 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement