గీతాలే ఉద్యమాన్ని గెలిపించాయి
సాక్షి, సిటీబ్యూరో: ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని సుభిక్షమైన నవతెలంగాణ నిర్మాణ ంలో కవులు, కళాకారులు భాగస్వాములు కావాలని సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయు పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యవుంలో కళాకారులు, కవులు నిర్వహించిన పాత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడుతుందన్నారు. ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సంపాదకీయంలో వెలువడిన ‘ఒక్కొక్క పాటేసి...’- తెలంగాణ నూటొక్క పోరు పాటలు.. పుస్తకాన్ని నగరంలోని ఆంధ్ర సారస్వత పరిషత్ హాలులో ఆదివారం సాయుంత్రం కవులు, కళాకారులు ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన దత్తాత్రేయ మాట్లాడుతూ బంగారు తెలంగాణ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. తెలంగాణ ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయుణ వూట్లాడుతూ పాట వులి దశ తెలంగాణ ఉద్యవుంలో కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు. సీనియుర్ సంపాదకులు కె. రావుచంద్రవుర్తి వూట్లాడుతూ తెలంగాణ కని పెంచిన కవులు ప్రపంచంలో ఎక్కడా కనిపించరని ... ఇక్కడి కవులు, కళాకారుల గొప్ప తనం, త్యాగనిరతిని కొనియూడారు. ఎమ్మెల్యే రసవురుు బాలకిషన్ వూట్లాడుతూ పాట ద్వారానే తాను అసెంబ్లీకి వెళ్లానని... ఆ పాటను ఎప్పటికీ వుర్చిపోలేనన్నారు.
సభలో వూజీ ఎంపీ వుధుయూష్కి, ప్రొఫెసర్ జయుధీర్ తిరువులరావు, సంపాదకులు టంకశాల అశోక్, ప్రజా కవులు, కళాకారులు గద్దర్, గోరటి వెంకన్న, వివులక్క, అంద్శై సుద్దాల అశోక్ తేజ, అల్లం రాజయ్యు, జూలూరి గౌరీశంకర్, డాక్టర్ చెరుకు సుధాకర్, జగన్, దరువు ఎల్లన్న, వేణు సంకోజులు వూట్లాడారు. తెలంగాణ రిసోర్స్ సెంటర్ అధ్యక్షుడు వేదకువూర్ అధ్యక్షత జరిగిన ఈ సభలో గద్దర్, గోరటి వెంకన్న, వివులక్క, అంద్శైపలువురు కళాకారుల ఆట- పాటలు ఆకట్టుకున్నాయి.