ఫీజు నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి
► సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య లేఖ
సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజధాని నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తే బాగుంటుందని, ఈమేరకు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు.
అధిక ఫీజులు, డొనేషన్లు అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చట్టాన్ని పాస్ చేయాలన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయాలని, ఒకే యాజమాన్యం కింద విద్యాసంస్థలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు.