special act
-
తప్పు చేసినా శిక్షకు అతీతులా?
ఈశాన్య భారత రాష్ట్రమైన నాగాలాండ్‌లో సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టాన్ని వెనక్కి తీసుకోవాలనే డిమాండ్‌ను పరిశీలించడానికి ఒక కమిటీని నియమించిన కేంద్రం కమిటీ నివేదిక ఇవ్వక ముందే ఆ రాష్ట్రంలో మరో ఆరు నెలలు చట్టాన్ని పొడిగిస్తున్నట్లు చేసిన ప్రకటన వివాదాస్పదమైంది. డిసెంబర్ 4న నాగాలాండ్‌లో 13 మంది అమాయక పౌరులను తీవ్రవాదులుగా భావించి సాయుధ దళాలు కాల్చి చంపిన ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం ఇది పొరపాటున జరిగిన సంఘటన అని క్షమాపణలు చెప్పింది. నిజానికి ఇటువంటి సంఘటనలు ఈ చట్టం అమలులో ఉన్న ఈశాన్య భారతంలో సాధారణమే. తమను ఎవరూ శిక్షించలేరనీ, తాము శిక్షాతీతులమనీ భావిస్తున్న సైనిక దళాలు ఎన్నో అమానవీయ దురంతాలకు పాల్పడ్డాయి. ఒకప్పుడు రామ్వా గ్రామం వద్ద ఉన్న అస్సాం రైఫిల్స్ జవాన్లను ఆ గ్రామస్థులు క్రిస్మస్ వేడుకలకు ఆహ్వానించేవారు. అందుకే జవాన్లు ఈ ఏడాది కూడా రెండు కొత్త వాలీబాళ్లు, ఒక నెట్ బహుమతులుగా తీసుకొని రామ్వాకు వెళ్ళారు. కానీ గ్రామస్థులు ఆ బహుమతులను స్వీకరించడానికి నిరాకరించడంతో వారు విస్మయం చెందారు. తమతో ఫొటో దిగటానికి సైతం అక్కడి ఫుట్‌బాల్ క్రీడాకారులు నిరాకరిం చడం వారిని మరింత ఆశ్చర్యచకితులను చేసింది. గ్రామీణుల ఈ ప్రవర్తనకు అత్యంత ముఖ్యమైన కారణమే ఉంది. రామ్వా, మణిపూర్‌లోని ఉఖ్రుల్–ఇంఫాల్ రహదారిలో ఉన్న ఒక చిన్న గ్రామం. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో డిసెంబర్ 4న భారత భద్రతా దళాలు జరిపిన కాల్పులకు నిరసనగా అస్సాం రైఫిల్స్ సిబ్బంది రాకను గ్రామస్థులు హర్షించలేకపోయారు. నాటి కాల్పుల్లో ఏడుగురు బొగ్గు గని కార్మికులతో సహా 13 మంది పౌరులు మరణిం చారు. మణిపూర్ నాగాలకు, నాగాలాండ్ నాగాలకు మధ్య కనిపిస్తున్న ఈ సంఘీభావం వారిలో సైనిక దళాల పట్ల పెరిగిపోతున్న క్రోధానికి, పరాయీకరణ భావానికి ప్రతిబింబం అనవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తం సంఘటనను ‘పొరపాటు’ పేరుతో దాటవేయడానికి ప్రయ త్నించింది. సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంటులో క్షమాపణ కూడా చెప్పారు. కానీ నాగాలు మోన్ కాల్పులను, అంతకు ముందు జరిగిన దురం తాల నుంచి వేరుగా చూడటం లేదు. శిక్ష పడుతుందనే భయం ఏ కోశానా లేని సైనిక దళాల సంస్కృతిలో ఒక భాగంగానే దీన్నీ చూస్తున్నారు. సీనియర్ కార్యకర్తగా, శాంతి ప్రక్రియలో దీర్ఘకాలం పాల్గొంటూ వచ్చిన డాక్టర్ అకుమ్ లాంగ్చారి... ‘‘భారత సైన్యంలోని 21వ పారా స్పెషల్ ఫోర్స్‌పై టిజిత్ పోలీస్ స్టేషన్ సుమోటో ఎఫ్ఐఆర్ నమోదుచేసింది. అందులో ‘ఎలాంటి రెచ్చగొట్టే చర్యలూ ఎదురుకాక పోయినా వాహనంపై భద్రతా దళాలు గుడ్డిగా కాల్పులు జరిపాయి, ఫలితంగా అనేక మంది ఒటింగ్ గ్రామస్థుల హత్యలు జరిగాయి. అలాగే చాలా మంది తీవ్రంగా గాయాలపాలయ్యార’’ని పేర్కొన్నారు. అందువల్ల భద్రతా దళాల ఉద్దేశం పౌరులను హత్యచేయడం, గాయ పరచడమేనని స్పష్టమవుతోందని ఆ ఎఫ్ఐఆర్ పేర్కొందని అన్నారు. గత 63 సంవత్సరాలుగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం (ఏఎఫ్ఎస్పీఏ) విపరిణామాలను పరిశీలిస్తే... తాము ఏం చేసినా తమకు వచ్చే ముప్పేమీ లేదనే ధైర్యంతో సైనిక దళాలు అనేక అకృత్యాలకు పాల్పడ్డాయని అర్థమవుతుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 1958 నుండి 1979 వరకు, సాయుధ దళాలు ఈశాన్య ప్రాంతంలోని నాగాలు నివసించే ప్రాంతాల్లో తిరుగుబాటు వ్యతిరేక కార్యకలాపాలను నిర్వహించాయి. ఈ సమయంలో గ్రామాలు కాలి పోయాయి; కుటుంబాలు అడవుల్లో ఆకులు, అలములు తింటూ నివసించాయి; పురుషులు దారుణ హింసకు గురై మరణించారు. మహిళలు అత్యాచారానికి గుర య్యారు. ఇంత భారీ ఎత్తున మానవ హక్కుల ఉల్లంఘనలు కాకతా ళీయం కాదు. సైనిక శక్తిని ఉప యోగించి తిరుగు బాటును అణచివేసే విధానంలో భాగంగానే ఇన్ని దురంతాలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత 1978–79లో నాగాలు మానవ హక్కుల కోసం నాగా పీపుల్స్ మూవ్‌మెంట్‌ను ఏర్పాటు చేసి, తమ బాధలన్నింటినీ డాక్యు మెంట్ చేయడం ప్రారంభించారు. దీంతో దేశమంతటికీ మొదటి సారిగా సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టం గురించి తెలి సొచ్చింది. 1982 ఆగస్టులో నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ అనే కొత్త తిరుగుబాటు సంస్థ సైనిక దళాలపై మొదటి మెరుపుదాడి చేసింది. ఈ దాడిలో కొందరు సైనికులతో పాటు 21వ సిక్కు రెజి మెంట్ ఆఫీసర్ ఒకరు మరణించారు. మణిపూర్‌లోని ఉఖ్రుల్‌కు ఒక మహిళా నిజనిర్ధారణ బృందం వెళ్ళింది. సోషలిస్టు పార్లమెంటు సభ్యు రాలు ప్రమీలా దాదావతే నేతృత్వంలోని బృందంలో నేను కూడా సభ్యు రాలినే. మేము తిరిగి వచ్చి నివేదిక ఇస్తే ప్రచురణకు నోచుకోలేదు. 1983లో నాగా పీపుల్స్ మూవ్మెంట్ ఫర్ హ్యూమన్ రైట్స్ ఏఎఫ్ఎస్పీఏను సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసినప్పుడు, నేను కూడా పీపుల్స్ యూనియన్ ఫర్ డెమోక్రటిక్ రైట్స్ ప్రతినిధిగా సపోర్టింగ్ పిటిషన్ దాఖలు చేశాను. ఇంతకు ముందు మరో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లన్నింటినీ సుప్రీంకోర్టు రాజ్యాంగ బెంచ్‌కు పంపారు. కానీ 14 ఏళ్లపాటు అవి విచారణకు నోచుకోలేదు. చివరికి 1997లో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారించి సాయుధ దళాల (ప్రత్యేక అధికారాలు) చట్టం చెల్లుబాటును సమ ర్థించింది. తద్వారా ఆ చట్టం ప్రకారం పనిచేస్తున్న సాయుధ దళాలు తప్పు చేయలేదని చెప్పింది. ఇంతలో, నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ 1987 జూలైలో మణిపూర్ సేనాపతి జిల్లా ఓనామ్ గ్రామంలో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌పై మరో మెరుపుదాడి చేసింది. తమ నుంచి తిరుగుబాటు దారులు దోచుకువెళ్లిన ఆయుధాలను తిరిగి పొందడానికి అస్సాం రైఫిల్స్ ‘ఆపరేషన్ బ్లూబర్డ్’ అనే కోడ్ నేమ్‌తో తిరుగుబాటు వ్యతిరేక ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఇది మూడు నెలలకు పైగా కొన సాగింది. ఈ కాలంలో అస్సాం రైఫిల్స్ చేసిన దురాగతాలకు అంతే లేదు. ఇద్దరు గర్భిణీ స్త్రీలు సైనికుల ముందే బహిరంగంగా ప్రస వించవలసి వచ్చింది. ఆపరేషన్ బ్లూబర్డ్ బాధితుల తరఫున నేను కొందరు న్యాయవాదులతో కలసి 1988 నుంచి 1991 వరకు ఈ కేసుపై పోరాడాను. కేసు ముగిసే సమయానికి మానవ హక్కుల ఉల్లంఘనపై దాదాపు పది సంపుటాల సాక్ష్యాలు ఉన్నాయి. అయినా 25 ఏళ్లకు 2019లో హైకోర్టు ఫైళ్లు కనిపించకుండా పోయినందున తీర్పు ఇవ్వలేక పోతున్నట్లు తెలిపింది. మణిపూర్ మహిళల నుంచి ఏఎఫ్‌ఎస్‌పీఏకు కొన్ని ముఖ్యమైన సవాళ్లు ఎదురయ్యాయి. మొదటిది 2000 నవంబరులో ఇరోమ్ చాను షర్మిల నిరాహార దీక్ష రూపంలో ఎదురైంది. ఈ దీక్ష 16 ఏళ్లు సాగింది. అయినా ప్రభుత్వం చట్టాన్ని రద్దు చేయలేదు. తంగ్జాం మనోరమ అనే మహిళ కూడా ప్రభుత్వానికి సవాల్‌గా నిలవడంతో అస్సాం రైఫిల్స్... 32 ఏళ్ల మనోరమను అరెస్టు చేసి, హింసించి, ఆమె దేహాన్ని బుల్లెట్ లతో నింపి రోడ్డుపై పడవేసింది. ఆమె మరణంపై ఇచ్చిన న్యాయ మూర్తి నివేదిక ఎన్నడూ వెలుగు చూడలేదు. దీంతో సాయుధ దళ జవాన్లు తమను తాము శిక్షాతీతులుగా భావించుకుంటూ... ఆడ, మగ అనే తేడా లేకుండా అందరినీ నిర్భయంగా హత్య చేయడం, హింసిం చడం, అవమానించడం వంటి అమానవీయ చర్యలను కొనసాగించ డానికి వీలు కలుగుతున్నది. ఇలా ఈశాన్య భారతంలో సైనిక దళాల అకృత్యాలకు శిక్ష పడే అవకాశం లేకపోవడంతో అనేక విపరిణామాలు చోటుచేసుకున్నాయి. అందులో మొదటిది, ఈ చట్టం అమలులో ఉన్న ‘కల్లోలిత‘ ప్రాంతా లలో నివసిస్తున్న బాధితుల బాధలకు పరిష్కార వేదిక లేకుండా పోయింది. న్యాయానికి దూరమైన ప్రజలు కోపంతో ప్రభుత్వానికి దూరమవుతున్నారు. రెండవది, ఈ చట్టం రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను కూడా దెబ్బతీసింది. మూడవది, 63 సంవత్స రాలుగా అంతర్గత భద్రత కోసం సాయుధ దళాలను ఉపయోగిం చడం వాటిని భ్రష్టు పట్టించడానికి దారితీసింది. 2021 డిసెంబర్లో 13 మంది పౌరుల హత్యల తరువాత, ఏఎఫ్ఎస్పీఏను నాగాలాండ్ నుండి ఉపసంహరించుకోవాలా వద్దా అని పరిశీలించడానికి హోంమంత్రి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ నివేదిక ఇవ్వక ముందే నాగాలాండ్‌లో ఈ చట్టాన్ని ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్రం డిసెంబర్ 30న ప్రకటించింది. ఈ చట్టం కింద తలెత్తుతున్న సమస్యలు కేవలం ఈశాన్య రాష్ట్రాలకు చెందినవి మాత్రమే అనుకోకుండా ఇదొక జాతీయ సమస్యగా దేశ మంతా చర్చ జరగాలి. సాయుధ దళాల (ప్రత్యేక అధికారాల) చట్టాన్ని రద్దు చేయాలి. – నందితా హక్సర్ మానవ హక్కుల న్యాయవాది, రచయిత -
కీలక చట్టంపై బైడెన్ సంతకం.. చైనాకు చుక్కలే!
Joe Biden Signed Uyghurs Rights Protection Bill To Check China Atrocities: కీలకంగా భావించిన ఉయిగర్ చట్టంపై ఎట్టకేలకు అగ్రరాజ్యం అధినేత రాజముద్ర పడింది. చైనాను ఇరకాటంలో పడేసే ‘ఉయిగుర్ ఫోర్స్డ్ లేబర్ ప్రివెన్షన్ యాక్ట్’(బలవంతపు కార్మిక నిరోధక చట్టం) మీద గురువారం అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. అనంతరం ఆయన ట్విటర్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ద్వైపాక్షిక ఒప్పందం మీద సంతకం చేశా. కేవలం షిన్జియాంగ్ మాత్రమే కాదు.. చైనాలోని మిగతా ప్రాంతాలకు కూడా ఇది వర్తిస్తుంది. చైనా ప్రతీ మూల నుంచి వచ్చేవి బలవంతపు చాకిరీ ఉత్పత్తులు కావని నిర్ధారించుకునేందుకు మా వద్ద (అమెరికా ప్రభుత్వం) ఉన్న ప్రతీ సాధనాన్ని ఉపయోగించుకుంటాం’’ అంటూ ఉయిగర్ల చట్టాన్ని బలంగా అమలు చేసే ఉద్దేశాన్ని అధ్యక్షుడు జో బైడెన్ ట్విటర్ వేదికగా వినిపించారు. Today, I signed the bipartisan Uyghur Forced Labor Prevention Act. The United States will continue to use every tool at our disposal to ensure supply chains are free from the use of forced labor — including from Xinjiang and other parts of China. pic.twitter.com/kd4fk2CvmJ — President Biden (@POTUS) December 23, 2021 ఇదిలా ఉంటే చైనా పశ్చిమ ప్రాంతంలో పదిలక్షల మైనార్టీ వర్గపు జనాభాపై మానవ హక్కుల ఉల్లంఘన జరగుతోందని, వెట్టిచాకిరీ చేయించుకుంటోందని చైనా మీద ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అమెరికా అయితే ఈ వ్యవహారంలో చైనా మీద మొదటి నుంచే కొరడా ఝళిపిస్తోంది. ఈ క్రమంలో షిన్జియాంగ్ నుంచి తమ దేశానికి అన్ని దిగుమతులను నిషేధిస్తూ ఓ బిల్లు తీసుకొచ్చింది. బిల్లుకు సెనేట్ గత గురువారమే ఏకగ్రీవంగా ఆమోద ముద్ర వేయగా.. చివరి పేరాలో అభ్యంతరాల మేరకు మరో వారం ఆమోద ముద్ర వాయిదాపడింది. దీంతో ఆ అభ్యంతరాలపై క్లియరెన్స్ అనంతరం.. గురువారం (డిసెంబర్ 23న) అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేయడంతో చట్టం అమలులోకి వచ్చింది. Uyghur Forced Labor Prevention Act ప్రకారం.. బలవంతపు చాకిరీ లేకుండానే తయారుచేశామని నిరూపించగలిగిన ఉత్పత్తులను మాత్రమే ఇకపై అమెరికా చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇది నిరూపించుకోవాలంటే షిన్జియాంగ్ ప్రావిన్స్‌లోకి అమెరికా ప్రతినిధుల్ని, అంతర్జాతీయ జర్నలిస్టులు తప్పనిసరిగా అనుమతించాల్సి ఉంటుంది. అదే జరిగితే అక్కడ జరిగే అకృత్యాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు లేకపోలేదు. ఇలా వర్తకవాణిజ్యాన్ని ముడిపెట్టి.. చైనా బండారం బయటపెట్టాలన్నదే బైడెన్ ప్రభుత్వం వేసిన స్కెచ్. ఇక్కడో కొసమెరుపు ఏంటంటే.. కేవలం షిన్జియాంగ్ను మాత్రమే తొలుత చట్టంలో చేర్చిన అమెరికా పార్లమెంట్(కాంగ్రెస్).. ఆపై మిగతా ప్రావిన్స్‌లకు సైతం ఈ చట్టాన్ని అన్వయింపజేయడం. ఇదిలా ఉంటే వర్తకవాణిజ్యాల పరంగా అమెరికాకు వచ్చే వీలైనన్నీ దారులను చైనాకు మూసేస్తోంది బైడెన్ ప్రభుత్వం. బొమ్మలపై విషపు రసాయనాల పూత ఉంటోందని ఆరోపిస్తూ.. మేడ్ ఇన్ చైనా బొమ్మలను అమెరికాలో అడుగు పెట్టనివ్వట్లేదు. ఇక ఉయిగర్లపై జరుగుతున్న అఘాయిత్యాలను వ్యతిరేకిస్తూ.. ఆ దేశ బయోటెక్, నిఘా కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు.. ఇలా ఒక్కోదానిపై ఆంక్షలు విధిస్తూ పోతోంది. ఇక అమెరికా వైపు నుంచి కూడా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది. ప్రభుత్వం నుంచి అనుమతులు పొందకుండా.. చైనాకు ఎలాంటి ఉత్పత్తులను విక్రయించడానికి వీల్లేదని ఆదేశాలు అమలు చేస్తోంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. అమెరికాతో వర్తకం ద్వారా భారీ ఆదాయం వెనకేసుకుంటోంది. అయితే కరోనా పరిణామాల అనంతరం ఈ రెండు దేశాల మధ్య వాణిజ్యం బెడిసికొడుతోంది. ఈ క్రమంలో చైనాను దూరం పెడుతూ.. క్రమంగా భారత్ సహా ఇతర ఆసియా దేశాలకు దగ్గర అవుతోంది అమెరికా. సంబంధిత వార్త: డ్రాగన్‌కు దెబ్బలు.. షిన్జియాంగ్ మీదే ఫోకస్ -
గూగుల్, నెట్‌ఫ్లిక్స్, ఫేస్బుక్.. గ్లోబల్ ‘టాక్స్’ షాక్!!
టెక్, సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు కలిసికట్టుగా షాక్ ఇచ్చేందుకు ప్రపంచం సిద్ధమైంది. గ్లోబల్ ట్యాక్స్ పేరుతో కనీసం 15 శాతం టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు 136 దేశాల(భారత్ సహా) అంగీకారం తెలిపగా, పాక్ సహా నాలుగు దేశాలు మాత్రం ఈ ఒప్పందానికి దూరం జరిగాయి. ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (OECD) ఆర్గనైజేషన్ సమావేశం శుక్రవారం పారిస్‌లో జరిగింది. తమ తమ దేశాల్లో ఆపరేషన్‌ను నిర్వహించుకునేందుకు గూగుల్, ఫేస్బుక్, నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్, అమెజాన్.. ఇతరత్రాలకు ఓఈసీడీలోని దేశాలు కనీసం 15 శాతం ట్యాక్స్ విధించాలని తీర్మానించాయి. మొత్తం 140 దేశాల్లో శ్రీ లంక, కెన్యా, నైజీరియా, పాకిస్తాన్.. మాత్రం ఈ అగ్రిమెంట్లో చేరేందుకు విముఖత వ్యక్తం చేశాయి. అయితే టెక్ దిగ్గజాల నుంచి టాక్స్ వసూలు నిర్ణయం అమలు అయ్యేది మాత్రం 2023 నుంచే.. వీటితో పాటు ఏకపక్ష టాక్స్ విధింపు నిర్ణయాలను తక్షణమే వెనక్కి తీసుకుంటున్నట్లు OECD సభ్య దేశాలు ప్రకటించాయి. అక్టోబర్ 13న వాషింగ్టన్లో జరగబోయే జీ-20 ఫైనాన్స్ మినిస్టర్ల సమావేశంలో, ఈ నెలాఖరులో రోమ్(ఇటలీ)లో జరగబోయే జీ-20 నేతల సదస్సులో 15 శాతం పన్ను వసూలు నిర్ణయం గురించి అధికారిక ప్రకటన చేయనున్నారు. 15 మినిమమ్ టాక్స్ కాగా, గరిష్టంగా ఎంత ఉంటుందనేది మాత్రం ఫిక్స్ చేయలేదు. ఇక భారత్ విషయానికొస్తే.. డిజిటల్ అడ్వైర్టైజింగ్ సర్వీసుల మీద నేరుగా 6 శాతం ట్యాక్స్‌లను విధిస్తూ 2016లో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరంలో 1,600 కోట్ల రూపాయలు రాగా.. కిందటి ఏడాదితో పోలిస్తే అది రెట్టింపు వసూలు కావడం విశేషం. ఇక 2020లో నాన్ రెసిడెంట్ ఈకామర్స్ దారులపై 2 శాతం టాక్స్ విధించింది భారత్. ఇప్పటిదాకా తక్కువ శాతం చెల్లింపుతో సేవల్ని అందిస్తున్న టెక్ దిగ్గజాలకు.. కనీస విధింపు నిర్ణయం మింగుడు పడడం లేదు. సెర్చింజిన్ గూగుల్ అయితే ఇప్పటికే అడ్డగోలుగా ట్యాక్సులు చెల్లించాల్సి వస్తోందని అసంతృప్తిగా ఉంటోంది. ఈ నేపథ్యంలో జీ-20 సమావేశాల్లోపు ఓఈసీడీ దేశాలకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నాయి. అయితే సమయం లేకపోవడంతో ఈ ప్రయత్నం ఫలించకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. చదవండి: ఫేస్బుక్ ద్వారా సంపాదన.. ఎలాగో తెలుసా? -
మొదటి పదేళ్లు బదిలీ కుదరదు!
గువాహటి: ఉపాధ్యాయులు మొదటి పదేళ్లు ఒకే చోట పనిచేసేలా, ఆ తర్వాతే వారికి బదిలీ అవకాశం కల్పిం చేలా అసోం ప్రభుత్వం ఓ సరికొత్త చట్టాన్ని తీసుకురా నుంది. ఈ మేరకు బుధవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రకటించారు. దీని కోసం రూపొందించిన బిల్లును ప్రస్తుతం జరుగు తున్న బడ్జెట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టనున్నట్లు చెప్పా రు. ‘కొన్నేళ్లుగా ఉపాధ్యాయ బదిలీలు ప్రహసనంలా మారాయి. పలుకుబడి ఉన్న కొంతమంది తమకు తెలిసిన అధికారుల ద్వారా కావాల్సిన చోటుకు బదిలీ చేయించుకుంటున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టేలా ఓ కొత్త చట్టాన్ని ప్రవేశపె ట్టబోతున్నాం. దీని ప్రకారం కొత్తగా ఉపాధ్యాయ వృత్తిలో చేరిన వారు కనీసం పదేళ్ల పాటు బదిలీకి అనర్హులు. దీన్ని అతిక్రమించి అతను లేదా ఆమె బదిలీ పొందినట్లయితే వారితోపాటు, వారిని ట్రాన్స్ఫర్ చేసిన అధికారి సైతం విచారణ ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే కనీసం మూడేళ్ల శిక్ష తప్పదు. ఒకే చోట పదేళ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ చేసుకునేందుకు ఆన్లైన్ పద్ధతిని తీసుకొస్తున్నాం. అయితే, పరస్పర బదిలీలకు ఈ పదేళ్ల నిబంధన వర్తించదు’అని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సరికొత్త చట్టానికి సభలోని అన్ని పక్షాలూ మద్దతివ్వడం గమనార్హం. -
చెయ్యేస్తే.. ఆస్తి రాసేయాలి
మహిళలపై వేధింపులు, అత్యాచారాలు, హత్యలు.. తరచూ ఇవే వార్తలే. ఆడపిల్ల కనిపిస్తే రెచ్చిపోయే కామాంధులకు షాకిచ్చేలా అసెంబ్లీ స్థాయీసమితి నివేదిక రూపొందించింది. కామాంధుల ఆస్తులను స్వాధీనం చేసుకుని బాధితులకు పంపిణీ చేయడం, ఇతరత్రా కఠిన చర్యలే ఉపయుక్తమని పేర్కొంది. సాక్షి, బనశంకరి: మహిళలు, అమ్మాయిలపై లైంగిక దాడులకు పాల్పడే నేరగాళ్లకు ప్రభుత్వ సౌలభ్యాలను తొలగించి ఓటుహక్కును రద్దుచేయాలి. ఆస్తిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం అందించాలి, ఈ మేరకు చట్టం రూపొందించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని శాసనసభ అత్యాచారాల నియంత్రణ అధ్యయన స్థాయీ సమితి నిర్ణయించింది. కొంతకాలంగా రాష్ట్రంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల ఘటనలు మితిమీరడంతో బెంగళూరు ప్రతిష్ట మసకబారింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం 2014లో మహిళలు, బాలికలపై దౌర్జన్యాలు, అత్యాచారాలను నియంత్రించడమెలా అనే అంశంపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ఉగ్రప్పను దీనికి అధ్యక్షునికిగా నియమించారు. బుధవారం నివేదిక సిద్ధం చేసింది. 100 సిఫార్సులు ఉగ్రప్ప మాట్లాడుతూ 1500 పేజీలతో కూడిన సమగ్ర నివేదికను పూర్తి చేశామన్నారు. ప్రభుత్వానికి కనీసం 100 సిఫార్సులు చేశామని, నివేదికను త్వరలోనే ముఖ్యమంత్రికి అందజేస్తామని చెప్పారు. గతంలో ఈ సమితికి నాణయ్య అధ్యక్షునిగా ఉండగా 39 సమావేశాలు, తాను అధ్యక్షుడైన తరువాత 134 సమావేశాలు నిర్వహించి సమగ్ర నివేదికను రూపొందించామని తెలిపారు. దేవదాసీలు, ఎయిడ్స్ బాధితులు, హిజ్రాల సంరక్షణ చర్యలనూ నివేదికలో చేర్చామని ఉగ్రప్ప చెప్పారు. స్థాయీ సమితి చేసిన ముఖ్య సిఫార్సులు కొన్ని.. లైంగిక నేరగాళ్ల ఆస్తిని స్వాధీనం చేసుకుని బాధితులకు పరిహారం అందించాలి. దోషులకు ప్రభుత్వ సౌలభ్యాలు, ఓటుహక్కు ను రద్దుచేయాలి. కేసు నమోదైన 24 గంటల్లోగా బాధితులకు వైద్య పరిహారం అందించడం. కేసుల తీవ్రతను బట్టి పరిహారాన్ని నిర్ధారించాలి. కేసుల విచారణ పూర్తికి స్పష్టమైన గడువును నిర్ధారించాలి. కేసుల్లో జాప్యాన్ని తప్పించడానికి జాతీయచట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలి. శిక్షల తీవ్రతను పెంచితే అకృత్యాలు తగ్గుతాయి. ఈ విషయంలో ఎస్పీ, స్పెషల్ ప్రాసిక్యూటర్లకు బాధ్యతలు అప్పగించాలి. పరిహారం వస్తుంది కదా అని అబద్ధపు కేసులు పెట్టేవారి నుంచి వడ్డీ సమేతంగా పరిహారం వెనక్కి తీసుకునేలా చట్టం ఉండాలి. -
దివ్యాంగుల కోసం ప్రత్యేక చట్టం: కేంద్ర మంత్రి గెహ్లాట్
సాక్షి, చిక్కడపల్లి(హైదరాబాద్): కేంద్ర సామాజిక న్యాయం శాఖ మంత్రిగా మూడున్నరేళ్లుగా ఆనందంగా పనిచేస్తున్నానని, తన శాఖలో మూడు గిన్నిస్ రికార్డులు రావడం గర్వకారణంగా ఉందని తావర్ చంద్ గెహ్లాట్ అన్నారు. 2014లో మోదీ ప్రభుత్వం వచ్చాక దివ్యాంగుల హక్కుల కోసం ప్రత్యేక చట్టం తెచ్చిందన్నారు. ఇక్కడి త్యాగరాయ గానసభలో వికలాంగుల హక్కుల చట్టం-2016 పై శనివారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. 21 కేటగిరీలను చట్టంలోకి తెచ్చిన ఘనత తమదేనని, 3 శాతం ఉన్న రిజర్వేషన్‌ను 4 శాతానికి పెంచామని, కళాశాలల్లో చేరికల కోసం 5 శాతం రిజర్వేషన్‌ను తమ ప్రభుత్వమే మొదలు పెట్టిందని వివరించారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో 6 శాతం రిజర్వేషన్లు ఉన్నాయని, తెలంగాణలో కూడా ఇస్తే సంతోషమని అన్నారు. వికలాంగుల గుర్తింపు కార్డులు జిల్లాస్థాయిలో మాత్రమే కాదు దేశమంతా చెల్లుబాటయ్యేలా త్వరలో నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక్క స్కూల్ అయినా ప్రారంభించిందా అని నిలదీశారు. 10 లక్షల మంది దివ్యాంగులలో 4 లక్షల మందికి మాత్రమే సర్టిఫికెట్ ఇచ్చారన్నారు. మెట్రో రైలులో వికలాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వికలాంగులకు కేంద్రం అమలు జరిపే పథకాలపై అవగాహన కల్పిస్తామని, రాష్ట్ర ప్రభుత్వంపై పోరాడేందుకు త్వరలో వికలాంగుల హక్కుల భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని చెప్పారు. ఎస్సీ కమిషన్ జాతీయ సభ్యుడు రాములు కూడా పాల్గొన్నారు. -
ఫీజు నియంత్రణకు ప్రత్యేక చట్టం తేవాలి
► సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య లేఖ సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు దోపిడీని అరికట్టాలని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. రాజధాని నగరంతో పాటు జిల్లా కేంద్రాల్లో ఉన్న విద్యాసంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తే బాగుంటుందని, ఈమేరకు ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. అధిక ఫీజులు, డొనేషన్లు అరికట్టేందుకు ఫీజు నియంత్రణ చట్టం తేవాలన్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి చట్టాన్ని పాస్ చేయాలన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను కట్టడి చేయాలని, ఒకే యాజమాన్యం కింద విద్యాసంస్థలు ఉండేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు లేఖ రాశారు. -
నన్ను ‘విజేత’గా పంపించండి...!
సాయుధ దళాల ప్రత్యేక చట్టం వల్ల ఎంత మంది మరణిస్తున్నారో, రేప్‌కి గురి అవుతున్నారో తెల్సిందే. ఆ చట్టం ఎత్తివేతకోసం 15 ఏళ్ళుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోటం లేదంటే.. అసలు ఇండియన్ ఆర్మీ నన్ను, మణిపురి ప్రజలనెవరినీ మనుషులుగా భావించటం లేదు. తాజాగా సుప్రీంకోర్టు ఈశాన్య భారతదేశంలో జరిగిన 1528 బూటకపు ఎన్కౌంటర్లలో 62 కేసులని పరిశీలిస్తూ.. ‘దీర్ఘకాలం పాటు సాయుధ దళాల ప్రత్యేక చట్టం అమలులో ఉండటం అనేది ప్రజాస్వామ్యాన్ని పరిహసించటమే’ అంటూ చేసిన వ్యాఖ్య, ఆ కేసులపై ఇచ్చిన తీర్పు. ప్రజాస్వామ్యవాదులకు కొంత ఊరటనిచ్చింది. క్రూరమైన ఎ.ఎఫ్.ఎస్. పి.ఎ చట్టాన్ని ఎత్తివేసే రోజులు దగ్గర్లో ఉన్నాయేమో అనే ఆశ రేకెత్తిం చింది. ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని అడ్డు పెట్టుకుని ఇండియన్ ఆర్మీ చేస్తున్న హత్యలు, రేప్‌లకు వ్యతిరేకంగా ‘ఇండియన్ ఆర్మీ రేప్ అజ్’ అంటూ మణిపురి మహిళలు నగ్నంగా చేసిన పోరాటం ఇంకా పచ్చి పుండుగానే ఉంది. ఈ జూలై 14కి మణిపురి మహిళలు చేసిన ఆ పోరా టానికి సరిగ్గా పన్నెండేళ్ళు. ఆ సందర్భంగా 15 ఏళ్ళుగా నిరాహార దీక్ష చేస్తున్న.. ఇరోమ్ షర్మిలతో ఇంటర్వ్యూ.. 2016, మే 18 వ తేదీన ఇరోమ్ షర్మిలని కలిశాము. ఆమెని కలవ టానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేసి, ఎట్టకేలకు పర్మిషను తీసు కున్నాను. ఆమె జె.ఎన్.ఐ.ఎం.ఎస్ ఆస్పత్రిలో స్పెషల్ సెక్యూరిటీ జైల్లో ఆర్మీ పహారా మధ్య బందీగా ఉంది. అన్ని ప్రభుత్వాసుపత్రులు ఎలా ఉంటాయో... ఆ ఆస్పత్రి కూడా అలాగే.. కంపు కొడుతూ ఉంది. పర్మి షన్లు, చెకింగ్లు, ఆర్మీ వేసే ప్రశ్నలు అన్నిటికీ సమాధానాలు చెప్పి, ఆమె ఉన్న స్పెషల్ వార్డు దాకా నడుచుకుని వెళ్ళేసరికి... గంట పట్టింది. ఆమెని కలుసుకోటానికి పదిహేను నిమిషాలు మాత్రమే అనుమతి ఇచ్చారు. స్పెషల్ వార్డు అంటే ఏదో తళతళలాడే శుభ్రమైన ఏసీ గది అనుకున్నాను. అది చాలా చిన్న గది. తక్కువ వెలుతురుతో ఉన్న ఇరుకు గది అది. నెల్సన్ మండేలా పెద్ద ఫొటో, చాలా పుస్తకాలు, ఇరోమ్ షర్మిల పెంచుతున్న ఇండోర్ మొక్కలతో ఆ గది నిండి ఉంది. మేం వెళ్ళేసరికి ఆమె ఆ వార్డు కారిడార్‌లో వాకింగ్ చేస్తున్నారు. ఆమె ప్రతిరోజూ ఆ ఇరవై అడుగుల కారిడార్లోనే గంట పాటు వాకింగ్ చేస్తారట. ‘నీరసంగా మంచంలో పడుకుని ఉంటుందేమో’ అనుకున్న నాకు.. ఆమె నవ్వుతూ ఎదురొచ్చి, కుర్చీలు తనే వేసి.. కూర్చోమనటం చూసి.. మాట రాలేదు. నాతో పాటు వచ్చిన మీతియ్ మానవ హక్కుల కార్యకర్త ఒనిల్ మణిపురి భాషలో మాట్లాడి నన్ను పరిచయం చేశారు. ఆమెని చూసి ఏం మాట్లాడాలో, ఏం అడగాలో అర్ధం కాక.. మౌనంగా నిలబడ్డాను. ఏ ప్రశ్నలూ అడగను, మీరు చెప్పేది చెప్పండి అని మాత్రం అన్నాను. ఆమే మాట్లాడింది. నేను చాలా విసుగెత్తిపోయి ఉన్నాను. 15 ఏళ్లుగా నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. కనీసం మంచి నీటిచుక్క కూడా నా నోట్లో పడలేదు. నాది చాలా న్యాయమైన డిమాండు. ‘మమ్మల్ని మనుషులుగా చూడండి, ఆ ఏఎఫ్ఎస్పీఏ ఎత్తివేయండి’ అని అడుగుతున్నాను. అంతే. ఆ చట్టం వల్ల ఎంతమంది మరణిస్తున్నారో, రేప్‌కి గురి అవుతున్నారో తెల్సిందే. 15 ఏళ్లుగా నిరాహారదీక్ష చేస్తున్నా పట్టించుకోటం లేదు అంటే.. అసలు ఇండియన్ ఆర్మీ నన్ను మనిషిగా చూడటం లేదు. మణిపురి ప్రజలనెవ రినీ మనుషులుగా భావించటం లేదు. మా పోరాటాలకీ, మా అభిప్రా యాలకీ.. అసలు మా ప్రాణాలకీ, (స్త్రీల) శరీరాలకీ.. కాస్త కూడా విలువ, గౌరవం లేవు. భారతదేశం ఒక ప్రజాస్వామ్య దేశం అన్న నా విశ్వాసం సడలిపోకుండా ఉండటానికి 15 ఏళ్లుగా నేనెంతో మానసిక శ్రమ చేస్తున్నాను. కానీ.. ప్రభుత్వం నుంచి ఏ మాత్రం కదలిక లేదు. నాకు అందరిలా, మామూలు స్త్రీగా బతకాలని ఉంది. సాదా సీదాగా బతకాలని ఉంది. నేను ఇష్టపడుతున్న వ్యక్తి ఎన్నో ఏళ్ళుగా నా విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. నేను ఈ గదిలో కూర్చొని, అతను కానుకగా పంపిన మొక్కలని పెంచుతూ.. వాటి పచ్చదనంలోనే మా ప్రేమని బతికించుకుంటున్నాను. మొత్తం 39 మొక్కలు. మొన్న ఎవరో ఒక మొక్కను దొంగతనం చేశారు. ఇంత సెక్యూరిటీ ఉన్న చోట ఒక చిన్న మొక్క ఎలా దొంగతనానికి గురి అవుతుంది? ఎలా దొంగిలించారని కాదు.. ఎందుకు దొంగిలించారు? అని అడగాలేమో. ఎందుకంటే.. నాకు సంతోషాన్నిస్తున్న, నన్ను బతికిస్తున్న ఆ చిరు సంపద నా దగ్గర ఉండ కూడదు అనే ఆలోచనే నా మొక్కల్లో ఒక దాన్ని నాకు దూరం చేసింది. ఆ మొక్క ఇక్కడ నుంచి పట్టుకుపోయినా పర్లేదు. ఎక్కడో అక్కడ బతి కుంటే, రోజూ దానికి ఎవరో ఒకరు కాస్త నీళ్ళు పోస్తే చాలు. నేను విఫలమయ్యాను అనే బాధ అప్పుడప్పుడు నన్ను దహిం చేస్తుంటుంది. 15 ఏళ్లుగా అమ్మని కూడా చూడకుండా ఈ గదిలో ఇలా ఉన్నాను. మొన్న కోర్టులో హాజరైనప్పుడు.. నాకు మద్దతు తెలిపే ఒక్క వ్యక్తి కూడా ఆ కోర్టు ఆవరణలో లేరు. అప్పుడు నిరాశపడ్డాను. కానీ మానవత్వం చనిపోలేదని నాకు తెలుసు. ఈ భూమిమీద ఇంకా మానవత్వం ఉందని నమ్ముతున్నాను. ప్రజలు ఎ.ఎఫ్.ఎస్.పి.ఎ చట్టాన్ని ఎత్తివేయమని దేశమంతటా పెద్ద ఎత్తున దీక్షలు చేయకపోటానికి కార ణం.. వారు వేరే పోరాటాల్లో మునిగి ఉండటమేనేమో అని నాకు నేను సర్ది చెప్పుకుంటాను అని అనగానే.. నేను ఇరోమ్కి రోహిత్ గురించి ఏమన్నా విన్నారా? అని అడిగాను. ‘టీవీ, పేపరు అందుబాటులో లేని ఈ చిన్ని ప్రపంచంలోకి రోహిత్ వచ్చాడు’ అన్నది నవ్వుతూ. నాకు రోహిత్ గురించి కానీ, ఇరోమ్ షర్మిలకి మద్దతుగా దేశంలో పలుచోట్ల ఏఎఫ్ఎస్పీఏ ఎత్తేయాలంటున్న వివిధ సంఘాల వివరాలు కానీ చెప్పే సమయం లేదు. నాకిచ్చిన 15 నిమిషాల గడువులో 6సార్లు గార్డులు లోపలికి వచ్చారు. పైగా ఆమె బక్క పలచటి శరీరంలో ఉన్న ఆ కాస్త రక్తాన్ని కూడా పెద్ద పెద్ద దోమలు తాగేస్తున్నాయి. నేను, నాతో వచ్చిన ఒనిల్ ఆ దోమల్ని చంపటంలో పడ్డాం. ఆమె నవ్వుతూ.. ‘ఎన్నిటిని చంపుతారు వదిలేయండి, నాకు వాటితో ఏం ఇబ్బంది లేదు. నేను భారత ప్రభుత్వాన్ని, ప్రజా సంఘా లని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతీ వ్యక్తిని కోరుకునేది ఒకటే.. నన్ను ఈ ప్రపంచం నుంచి విజేతగా పంపండి. ఏఎఫ్ఎస్పీఏ అనే క్రూర చట్టం ఎత్తేయటాన్ని నా కళ్ళతో నేను చూడాలి. నా అంతఃశక్తి నశిస్తోంది. నేను ఒక ‘విఫల అస్త్రం’గా ఆ విశ్వంలోకి వెళ్ళాల్సి వస్తుందేమో అని బాధగా ఉంది.. అందుకే మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నన్ను విజేతగా పంపండి..’ అంటూ ఆమె ఏడ్చింది. నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరిగాయ్. వెంటనే ఆమె కళ్ళు తుడుచు కుని, నవ్వుతూ నాకు షేక్‌హ్యాండ్ ఇచ్చి.. ‘అప్పుడప్పుడూ ఇలా అని పిస్తుంది. నేనూ మనిషినే, అది ఇండియన్ ఆర్మీ గుర్తించాలి’ అంటుం డగానే సమయం అయిపోయిందని గార్డు వచ్చి లాఠీతో తలుపుమీద కొట్టి అరిచి చెప్పాడు. ఆమె ఆ స్పెషల్ వార్డు కారిడార్ చివరి దాకా వచ్చి, మాకు వీడ్కోలు చెప్పింది. నేను బైటకి రాగానే, ఆ గ్రిల్ వెనక నిలబడి, ‘నాకే కాదు, ఏఎఫ్ఎస్పీఏ చట్టం ఎత్తేస్తారు.. నాకు మానవత్వం మీద విశ్వాసం ఉంది’ అని చెప్పి, లోపలికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మేం అక్కడున్న డ్యూటీ డాక్టరుని కలిశాం. ఇరోమ్ ఆరోగ్యం గురించి అడిగితే, ‘మెడికల్లీ మిరకిల్, హ్యూమన్లీ ఇంపాజిబిల్ (వైద్యపరంగా అద్భుతం, మానవపరంగా అసాధ్యం)’ అన్నాడాయన. నిజమే. మానవ చరిత్రలోనే ఇటువంటి పోరాటం జరగటం ఇదే మొదటి సారి. భారతదేశం తన స్వాతంత్ర పునాదులుగా చెప్పే.. ‘సత్యాగ్రహం, అహింస’ అనే రెండు మహోన్నత అస్త్రాలు ఇప్పుడు.. ఇరోమ్ షర్మిల చేతిలో ఉన్నాయి. దాన్ని గుర్తించి భారతదేశం ఏఎఫ్ఎస్పీఏని ఎత్తివేసి, ఇరోమ్ షర్మిలని స్వేచ్ఛా జీవిని చేస్తుందని మనందరం ఆశిద్దాం. (అత్యాచారాలకు వ్యతిరేకంగా మణిపురి మహిళలు చేసిన పోరాటానికి నేటికి సరిగ్గా పన్నెండేళ్లు) చైతన్య పింగళి, పాత్రికేయురాలు chaithanyapingali@gmail.com -
బాలల పరిరక్షణకు ప్రత్యేక చట్టం
నిడమర్రు : బాలల సంరక్షణకు భారత ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. జువనైల్ జస్టిస్(కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్)-2015 పేరుతో 2016 జనవరి 15 నుంచి అమల్లోకి తెచ్చింది. మనదేశంలో 1997లో చేసిన చట్టప్రకారం.. 16 ఏళ్లలోపు బాలలను జువనైల్స్గా గుర్తించేవారు. 1992 డిసెబర్ 11న భారత ప్రభుత్వం ఐక్యరాజ్య సమితి చేపట్టిన బాలల హక్కుల పరిరక్షణ ప్రత్యేక కార్యక్రమంలో భాగస్వామిగా మారింది. దీనిప్రకారం 2000లో కొత్త చట్టాన్ని అమల్లోకి తెచ్చి బాలల వయసును 16 నుంచి 18 ఏళ్లకు పెంచింది. తాజాగా నిర్భయ కేసులో మహిళలనుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ వయసును 18 ఏళ్లుగానే ఉంచి నేరాలను స్వల్ప, తీవ్ర, క్రూర నేరాలుగా వర్గీకరించి 16 నుంచి 18 ఏళ్లలోపు వారు క్రూర నేరాలకు పాల్పడితే మేజర్లకు విధించే శిక్షలే అమలు చేసేలా చట్టంలో సవరణలు చేశారు. ఈచట్టంలో బాలనేరస్తులకు సంబంధించే కాకుండా శిశు క్రయ, విక్రయం, దత్తత, అనాథ బాలలకు సంబంధించిన అంశాల్లోనూ మార్పులు చేశారు. చట్టంలో ముఖ్యాంశాలు నేరాలను మూడు రకాలుగా విభజించారు. స్వల్ప శిక్షనేరాలు (మూడేళ్లలోపు జైలు), తీవ్ర శిక్ష నేరాలు (ఏడేళ్లలోపు జైలు), క్రూర శిక్ష నేరాలు (ఏడేళ్లకు పైబడి జైలు)గా వర్గీకరించారు. ప్రతి జిల్లాలో బాలల నేర కేసులను విచారించడానికి జువనైల్ జస్టిస్ బోర్డు ఏర్పాటు చేయాలి. బోర్డులో ఫస్ట్‌క్లాస్ స్థాయి మెజిస్ట్రేట్, ఇద్దరు సభ్యులను నియమించాలి. ఆ ఇద్దరి సభ్యుల్లో ఒకరు తప్పనిసరిగా మహిళా సభ్యురాలై ఉండాలి. 18 ఏళ్లలోపు బాలలపై కేసు నమోదై, విచారణ తేదీకి 18 ఏళ్లు దాటినా ఈ చట్టం కిందే విచారణ చేస్తారు. బాలనిందితుడిని లాకప్లోగానీ, జైల్లోగానీ పెట్టకూడదు. బెయిలబుల్ నేరాలు లేదా నాన్‌బెయిలబుల్ నేరాల్లో బాలలు వెంటనే పోలీసుల వద్దే బెయిల్ పొందే అవకాశం ఉంది. కానీ నిందితుడు మళ్లీ నేరం చేస్తాడని, చెడు ప్రవర్తనకు అలవాటు పడతాడని పోలీసులు భావిస్తే స్టేషన్‌బెయిల్ ఇవ్వకపోవచ్చు. బాలనేరాల విచారణ బోర్డు నాలుగు నెలల్లోపు ముగించాలి. కారణాలు చూపించి మరో రెండు నెలలే పొడిగించే అవకాశం ఉంది. ఆరు నెలల తర్వాత విచారణ ముగించలేకుంటే విచారణ రద్దవుతుంది. తీవ్ర, క్రూర నేరాల్లో విచారణ కాలం ఆరునెలలు తర్వాత కూడా పెంచుకునే అధికారం బోర్డుకు ఉంది. 16ఏళ్లలోపు స్వల్ప, తీవ్ర నేరాల్లో బాలలకు ఎటువంటి శిక్షలూ వేయకూడదు.ప్రొటెక్షన్ హోమ్‌లో 21 ఏళ్లు దాటిన తర్వాత ఉంచకూడదు. 16 ఏళ్లు దాటిన బాలలు క్రూర శిక్ష నేరాలకు పాల్పడినప్పుడు చిల్డ్రన్ కోర్టు వేసిన శిక్షను 21ఏళ్లు నిండిన తర్వాత అమలు చేయాలి. 21 ఏళ్ల వరకూ ప్రొటెక్షన్ హోమ్‌లో ఉంచాలి. బాలనేరస్తులకు జీవిత ఖైదుగానీ మరణ శిక్షగానీ విధించకూడదు. స్వల్ప, తీవ్ర నేరాలకు పాల్పడిన బాలలను ఉద్యోగాలకు, రాజకీయాలకు అనర్హులుగా చూడకూడదు. బాల నేరస్తుల పేర్లను, వారి చిరునామాలను పత్రికల్లోనూ, ఎలక్ట్రానిక్ మీడియాలోనూ వెల్లడించకూడదు. బాలలను బాధ పెడితే శిక్షలు, జరిమానాలు బాలలను సంరక్షించాల్సిన బాధ్యత గల వ్యక్తులు, సంస్థలు ఉద్దేశపూరకంగా వారిని పట్టించుకోకపోయినా, మానసికంగా, శారీరకంగా బాధకు గురిచేసినా వారికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష వరకూ జరిమానా విధించవచ్చు. ఆ సంస్థల నిర్లక్ష్యం వల్ల బాలలకు శారీరక , మానసిక వైకల్యం కలిగినట్లు రుజువైతే పదేళ్ల జైలు శిక్ష, రూ. ఐదులక్షల వరుకూ జరిమనా విధించవచ్చు బాలలను భిక్షాటనకు ప్రోత్సహిస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. 18 ఏళ్లలోపు వారిని మద్యం, సిగెరెట్లు, మారక ద్రవ్యాల రవాణాకు ఉపయోగించినా, వాటిని తాగేందుకు ప్రోత్సహించినా, అమ్మేందుకు, కొనుగోలుకు వారిని వినియోగించినా ఏడేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధిస్తారు. బాలలను పనికి పెట్టుకున్నా.. వారితో వెట్టిచాకిరీ చేయించి వారి జీతభత్యాలను స్వలాభం కోసం వాడుకున్నా, బాలలను అమ్మినా, కొన్నా ఐదేళ్ల వరకూ జైలు, రూ.లక్ష వరకూ జరిమానా విధిస్తారు. ఆస్పత్రులు, బాలల వసతిగృహాల నిర్వాహకులు లేదా యజమానులు బాలలను అమ్మితే మూడేళ్ల నుంచి ఏడేళ్ల ఏళ్ల వరుకూ శిక్ష విధిస్తారు. బాల సంరక్షణ సంస్థలు బాలలను శారీరకంగా దండిస్తే, మొదటి తప్పుకు రూ.10వేలు జరిమానా తర్వాత నేరానికి మూడు నెలల వరుకూ జైలు శిక్ష విధించవచ్చు. -
చెరువుల రక్షణకు ప్రత్యేక చట్టం
సాక్షిప్రతినిధి, ఆదిలాబాద్: చెరువులు, చెరువు భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం యోచి స్తోందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు పేర్కొన్నారు. సాగునీటి రంగ అభివృద్ధికి సర్కారు చిత్తశుద్ధితో పనిచేస్తోందని అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం అమలు చేస్తున్న పీఎంకేఎస్‌వై పథకం కింద తెలంగాణలో ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ జిల్లాలను ఎంపిక చేశామని, ఈ జిల్లాల సాగునీటి విధానంతో పాటు, వ్యవసాయ విధానం కూడా కేంద్రానికి నివేదించాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో రూ.1,024 కోట్ల అంచనా వ్యయంతో 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాముల నిర్మాణం చేపట్టామన్నారు. వచ్చే ఖరీఫ్ నుంచి వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. కాంగ్రెస్ పాలకుల వల్లే రైతులకు కష్టాలు.. కాంగ్రెస్ పాలకుల పాపాల వల్లే రైతుల కష్టాలు కొనసాగుతున్నాయని హరీశ్‌రావు విమర్శించారు. కట్టలుంటే కాలువలుండవు.. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు పరిహారం విడుదల చేయలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పరిహారం పంపిణీ చేశామని అన్నారు. తుమ్మిడిహెట్టి బ్యారేజీ మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న అనవసర రాద్ధాంతం మానుకోవాలని హితవు పలికారు. తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజీ నిర్మించి ఆదిలాబాద్ జిల్లాకు అదనంగా లక్ష ఎకరాలకు సాగునీటిని అందిస్తామని పునరుద్ఘాటించారు. అర్ధంతరంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని, పనులు చేసేందుకు ముందుకురాని చోట్ల కాంట్రాక్టర్లను మార్చి కొత్తగా టెండర్లు పిలుస్తామన్నారు. ‘పెన్‌గంగ’ ద్వారా 50వేల ఎకరాలకు నీరు.. పెన్‌గంగపై తలపెట్టిన బ్యారేజీ నిర్మాణ పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి, 50వేల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. ఎస్సారెస్పీ, నిజాంసాగర్ వంటి ప్రాజెక్టులకు మరింత జలకళ వచ్చేలా చూస్తామన్నారు. విలేకరుల సమావేశంలో జిల్లా మంత్రులు జోగురామన్న, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ గొడాం నగేష్, కలెక్టర్ ఎం.జగన్మోహన్ నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సార్వత్రిక విద్యలో ఇగ్నో కీలకపాత్ర
40 దేశాల్లో అధ్యయన కేంద్రాలు దేశంలో 67 ప్రాంతీయ కేంద్రాలు 8న 28వ ఇగ్నో స్నాతకోత్సవం విజయవాడ (వన్‌టౌన్) : భారతదేశంలో సార్వత్రిక విద్యను అందించే విద్యా సంస్థల్లో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మేటిగా ఉంది. ఉన్నత విద్యావ్యాప్తి కోసం 1985 నవంబర్ 19న ఇగ్నోను ఢిల్లీ కేంద్రంగా ఏర్పాటు చేశారు. పార్లమెంట్లో ప్రత్యేక చట్టం ద్వారా దీని ఏర్పాటుకు ప్రభుత్వం పునాదులు వేసింది. రోజువారి (రెగ్యులర్) విద్యా విధానంలో ఉన్నత చదువులు చదవాలనే కాంక్ష బలంగా ఉండి, ఆ అవకాశం లేని లక్షలాదిమంది ఇగ్నో ద్వారా తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. విద్యావ్యాప్తితో పాటుగా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే క్రమంలో ఇగ్నో విధానాలు యువతకు బాసటగా నిలుస్తున్నాయి. ఈనెల 8న ఇగ్నో స్నాతకోత్సవం జరుగనుంది. ప్రమాణాల్లో రాజీ లేదు ప్రతి విద్యార్థి ఆయా కోర్సుకు సంబంధించిన ఎసైన్‌మెంట్లను పూర్తి చేసి సమర్పించాలి. ఎసైన్‌మెంట్లకు ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం 30 శాతం మార్కులను కేటాయిస్తుంది. అలాగే రాత పరీక్షలకు 70 శాతం మార్కులు ఉంటాయి. రెండింటిలోనూ విద్యార్థులు సరైన ప్రతిభ కనబరిచినప్పుడే ఆ కోర్సు ఉత్తీర్ణులయ్యేం దుకు అవకాశముంటుంది. దీనిలో ఇగ్నో రాజీ పడకుండా ముందుకు సాగుతోంది. ఉతీర్ణతా సర్టిఫికెట్లలో క్రెడిట్స్‌తో పాటుగా మార్కుల శాతాన్ని కూడా ముద్రిస్తారు. ఉపాధే లక్ష్యంగా కోర్సులు యూజీ, పీజీ కోర్సులతో పాటు ఉపాధి అవకాశాలను ప్రభావితం చేసే పలు కోర్సులను కూడా ఇగ్నో అందిస్తోంది. కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాల్లో ఉన్న పాడి పరిశ్రమను గమనంలో ఉంచుకొని డిప్లమో ఇన్ డెయిరీ టెక్నాలజీ కోర్సును ప్రత్యేకంగా ఇంగ్లిష్, తెలుగు మీడియాల్లో నూతనంగా ప్రవేశ పెట్టారు. ఎంఏ (సైకాలజీ), ఎంఎస్సీ (కౌన్సిలింగ్ అండ్ ఫ్యామిలీథెరఫీ), ఎంఎస్డబ్ల్యు (కౌన్సిలింగ్ ) కోర్సులు, అలాగే పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి పీజీ డిప్లమో ఇన్ ప్రీ ్రైపైమరీ ఎడ్యుకేషన్, విద్యా కళాశాలల్లో బోధకులుగా వెళ్లేవారికి ఎంఏ (ఎడ్యుకేషన్) తదితర కోర్సులు ఉన్నాయి. 29 అధ్యయన కేంద్రాలు రాష్ట్రం విడిపోయిన తరువాత విజయవాడ రీజినల్ సెంటర్ కీలకంగా మారింది. విజయవాడ రీజినల్ కేంద్రం ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపూర్, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాల్లో స్టడీ సెంటర్లు కొనసాగుతున్నాయి. 2013లో రాయలసీమ జిల్లాలకు సంబంధించి తిరుపతిలో సబ్ రీజినల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. విజయవాడ రీజినల్ కేంద్రం పరిధిలో మొత్తం 29 అధ్యయన కేంద్రాల ద్వారా వేలాది మంది విద్యార్థులు పలు డిగ్రీలను పూర్తి చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులు ఇగ్నోకు ప్రపంచ వ్యాప్తంగా విద్యార్థులు ఉన్నారు. ప్రధానంగా గడిచిన మూడు దశాబ్ధాల్లో 40 దేశాలకు ఇగ్నో సేవలు విస్తరించాయి. దేశ వ్యాపితంగా 67 ప్రాంతీయ కార్యాలయాలు, వాటి కింద 2,600కు పైగా స్టడీ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఇగ్నో మొత్తం 142 కోర్సులను అందిస్తుండగా విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పరిధిలో వంద వరకు కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఇగ్నో కార్యాలయ ప్రతినిధులు చెబుతున్నారు. బీకాం (ఏ అండ్ ఎఫ్)కు భలే డిమాండ్ సీఏ కోర్సును అభ్యసిస్తున్న విద్యార్థులకు ఒకే ఏడాదిలో బీకాం (ఏ అండ్ ఎఫ్) డిగ్రీ పూర్తి చేసుకునే అవకాశాన్ని ఇగ్నో కల్పిస్తోంది. ఈ కోర్సును ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అక్కౌంటెన్సీ, ఇగ్నో సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. నగరంలో సీఏ విద్యా సంస్థలు అధికంగా ఉండటంతో ఈ కోర్సుకు మంచి డిమాండ్ ఉంది. -
'చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టం'
హైదరాబాద్: చెరువుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకొస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖమంత్రి హరీశ్ రావు తెలిపారు. హైదరాబాద్ లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ లో ఉన్న 30 పంటలను ఆధునీకరస్తామని చెప్పారు. భూగర్భజలాలను కాపాడతామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ నిమిత్తం 'మిషన్ కాకతీయ' ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. అందుకో భాగంగానే అవసరమైతే కొత్త చట్టాన్ని తీసుకొచ్చే యోచనలో సర్కారు ఉందని మంత్రి హరీశ్ తెలిపారు. -
అసోంలో ప్రైవేట్ స్కూళ్లకు ముకుతాడు
గువాహటి: తమ వద్ద నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వేతర పాఠశాలలకు ముక్కుతాడు వేసేందుకు అసోం రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నేరుగా ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆదేశాలు జారీచేయగల ప్రత్యేక చట్టాన్ని తీసుకురానుంది. నిబంధనలను తుంగలో తొక్కి విద్యార్థులనుంచి అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేయడమే కాకుండా వారికి ఎంతో శ్రమకూర్చి విద్యాబోధన చేసే టీచర్లకు చాలిచాలని జీతభత్యాలు ఇవ్వడం, అవి కూడా సరైన సమయానికి చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడం, ఒక్కోసారి ఎగవేతలకు పాల్పడటంవంటి చర్యలకు తమ చట్టం ద్వారా స్వస్థి పలకనున్నారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీ ప్రశ్నోత్తర సమయంలో అసోం గణ పరిషత్ ఎమ్మెల్యే కేషాబ్ మహంత అడిగిన ప్రశ్నకు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మంత్రి శరత్ బోర్కోటోకి బదులిచ్చారు.