‘సెర్ప్‌’పై ప్రత్యేక నిఘా వ్యవస్థ | Special surveillance systems on Serp | Sakshi
Sakshi News home page

‘సెర్ప్‌’పై ప్రత్యేక నిఘా వ్యవస్థ

Published Tue, Jan 24 2017 12:44 AM | Last Updated on Tue, Sep 5 2017 1:55 AM

‘సెర్ప్‌’పై ప్రత్యేక నిఘా వ్యవస్థ

‘సెర్ప్‌’పై ప్రత్యేక నిఘా వ్యవస్థ

సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) కార్యక్రమాల పర్యవేక్షణ నిమిత్తం ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని పాలకమండలి నిర్ణయిం చింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన సోమవారం సచివాల యంలో పాలకమండలి సమావేశమైంది. పేదరిక నిర్మూలనకు సంబంధించిన 14 అంశా లపై సమావేశంలో విస్తృత చర్చ జరిగింది. సెర్ప్‌లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 120 నుంచి 180కి పెంచే ప్రతిపాదనకు పాలకమండలి ఆమోదం తెలి పింది. మరణించిన సెర్ప్‌ ఉద్యోగుల అంత్య క్రియల ఖర్చును రూ.10  వేల నుంచి రూ.20 వేలకు పెంచాలనే ప్రతిపాదనను కూడా ఆమో దించింది. గతంలో క్రమశిక్షణ చర్యలకు గురైన పలువురు ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసు కోవాలన్న వారి అభ్యర్థనలను పాలకమండలి తోసిపుచ్చింది.

 మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సెర్ప్‌ కార్యక్రమాల్లో అవకతవకలకు పాల్పడిన వారిని తొలగించడం జరిగిందని, ఇకపైనా ఎటువంటి అక్రమాలను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఆసరా పెన్షన్లతో పాటు, మహి ళా సంఘాలకు రుణ సౌకర్యం, టీఆర్‌ఐజీపీ లాంటి పలు కార్యక్రమాల అమలులో అవక తవకలను నివారించేందుకు కొత్తగా ఏర్పాటు చేయబోతున్న విజిలెన్స్‌ సెల్‌ దోహదపడు తుందన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి అత్య« దిక నిధులు వచ్చేలా తరచుగా సంప్రదింపులు, పర్యవేక్షణ చేసేందుకు వీలుగా వేరొక సెల్‌ను ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో సెర్ప్‌ సీఈవో నీతూకుమారి ప్రసాద్, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌. లక్ష్మణ్, స్త్రీ నిధి బ్యాంక్‌ అధ్యక్షురాలు అనిత, సెర్ప్‌ డైరెక్టర్లు బాలయ్య, రాజేశ్వర్‌రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement