సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ-సికింద్రాబాద్ మధ్య తత్కాల్ స్పెషల్ ట్రైన్ నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. విశాఖ-సికింద్రాబాద్ (02871/02872) స్పెషల్ ట్రైన్ ఈ నెల 8,9,10 తేదీలలో సాయంత్రం 4.45 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.30 కు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈ నెల 9,11 తేదీలలో రాత్రి 9.40 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.25 కు విశాఖ చేరుకుంటుంది. కాకినాడ-హైదరాబాద్ (07006) స్పెషల్ ట్రైన్ ఈ నెల 7వ తేదీ సాయంత్రం 3.30 కు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.15కు నాంపల్లికి చేరుకుంటుంది.