సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే సన్నాహాలు చేపట్టింది. లింగంపల్లి రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ మీదుగా ఉందానగర్ వరకు ‘ఎయిర్‌పోర్టు స్పెషల్’ డెము రైళ్లు నడపనున్నారు. ఈవిషయమై మంగళవారం రైల్‌నిలయంలో వివిధ విభాగాల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ చర్చించారు. ఉందానగర్ రైల్వేస్టేషన్‌లో దిగిన ప్రయాణికులు అక్కడి నుంచి 6 కి.మీ. దూరంలో ఉన్న విమానాశ్రయానికి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం ట్రైన్-బస్సు లింకు సర్వీసులను అందుబాటులోకి తేవాలని దక్షిణమధ్య రైల్వే యోచిస్తోంది.
ప్రయాణికుల సదుపాయాలకే పెద్దపీట
ప్రయాణికుల సదుపాయాలకే దక్షిణమధ్య రైల్వే అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్నారు. దేశంలోని 16 రైల్వేజోన్‌లకు చెందిన 50 మంది ప్రతినిధులతో కూడిన 26వ మెయింటెనెన్స్ స్టడీ గ్రూపు మంగళవారం రైల్‌నిలయానికి విచ్చేసింది. ఈ సందర్భంగా జీఎం వారితో సమావేశమయ్యారు. దక్షిణమధ్య రైల్వే అందజేస్తున్న సేవలను గురించి వారికి వివరించారు. ప్రయాణికుల సదుపాయాల విషయంలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటిస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలో విమానాశ్రయానికి ప్రత్యేక రైళ్లు
Published Wed, Dec 24 2014 4:43 AM | Last Updated on Sat, Sep 2 2017 6:38 PM
Advertisement