ఠాణాలోకి దూసుకొచ్చిన స్పోర్ట్స్‌ బైక్‌ | Sports bike that thrown into the cliff | Sakshi
Sakshi News home page

ఠాణాలోకి దూసుకొచ్చిన స్పోర్ట్స్‌ బైక్‌

Published Sun, Jul 2 2017 2:26 AM | Last Updated on Tue, Aug 21 2018 9:20 PM

ఠాణాలోకి దూసుకొచ్చిన స్పోర్ట్స్‌ బైక్‌ - Sakshi

ఠాణాలోకి దూసుకొచ్చిన స్పోర్ట్స్‌ బైక్‌

బైక్‌పై వచ్చి.. పోలీస్‌ స్టేషన్‌ను తనిఖీ చేసిన ఎస్పీ
 
చందుర్తి(వేములవాడ): సమయం.. శనివారం ఉదయం 9.15 గంటలు.. రయ్‌మంటూ స్పోర్ట్స్‌ బైక్‌ ఒకటి పోలీస్‌స్టేషన్‌లోకి దూసుకొచ్చింది.. హెల్మెట్‌.. స్పోర్ట్స్‌ జాకెట్‌ ధరించిన ఆ వ్యక్తి ఆ బైక్‌పై నుంచి కిందికి దిగారు. ఈ హఠాత్పరిణామానికి నోరెళ్ల బెట్టి చూస్తున్న పోలీసులు, అంతేవేగంతో అప్రమత్తమయ్యా రు.. శత్రువు ఎవరైనా వచ్చారా? అని ఆలోచిస్తూనే ఆయుధాలు ఎక్కుపెట్టారు..

కానీ, బైక్‌పై వచ్చిన వ్యక్తి వెనుక నుంచి గన్‌మన్‌ బైక్‌ దిగడంతో.. వచ్చింది పోలీసు ఉన్నతాధికారి అయి ఉంటారని ఆసక్తిగా చూశారు.. అంతలోనే ఎస్పీ విశ్వజిత్‌ తన తలపై హెల్మె ట్‌ను తొలగించారు.. ఆయనను గుర్తించిన పోలీసు సిబ్బంది.. ఎస్పీకి సెల్యూట్‌ చేశారు. ఇలా స్పోర్ట్స్‌ బైక్‌పై రాజన్న సిరిసిల్ల జిల్లా చందూర్తి ఠాణాను శనివారం ఎస్పీ విశ్వజిత్‌ కంపాటి తనిఖీ చేశారు. ఠాణా పరిసరాలను పరిశీలించారు. ఫిర్యాదుదారుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement