
హన్మకొండ చౌరస్తా: పసిపాపపై అఘాయిత్యానికి ఒడిగట్టిన నిందితుడికి విధించిన ఉరి శిక్షను తగ్గిస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించడం మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని చిన్నారి శ్రీహిత తండ్రి కె.జంగయ్య ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ కుమార్‌పల్లిలో జూన్ 17 రాత్రి తల్లి ఒడిలో నిద్రిస్తున్న శ్రీహితను నిందితుడు ప్రవీణ్ ఎత్తుకెళ్లి అత్యాచారం, హత్య చేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఆయన ఆదివారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ కన్నీళ్ల పర్యంతమయ్యాడు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దేశ సర్వోత్తమ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment