అక్కడ ఏ చట్టాలూ పని చేయడంలేదు | State violence against people a concern to date, say activists | Sakshi
Sakshi News home page

అక్కడ ఏ చట్టాలూ పని చేయడంలేదు

Published Mon, Sep 4 2017 1:28 AM | Last Updated on Sun, Sep 17 2017 6:20 PM

అక్కడ ఏ చట్టాలూ పని చేయడంలేదు

అక్కడ ఏ చట్టాలూ పని చేయడంలేదు

ఛత్తీస్‌గఢ్‌లో సైనిక పాలన సాగుతోంది
► ఆదివాసీ ఉద్యమనాయకురాలు సోనీసోరి


సాక్షి, హైదరాబాద్‌: ‘‘హమ్‌ మర్‌జాయేంగే లేకిన్‌ జమీన్‌ నహీ దేంగే’’... ఇదే ఇప్పుడు ఛత్తీస్‌గఢ్‌ బస్తర్‌ ప్రాం తంలోని బుర్కాపాల్‌ గ్రామ మహిళల నినాద మని ఆ రాష్ట్ర ఆదివాసీ ఉద్యమ నాయకురాలు సోనీసోరి చెప్పారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పుడు ఏ చట్టాలూ, న్యాయ వ్యవస్థా పనిచేయడంలేదని, సైనిక పాలన కొనసాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడుగడుగునా పోలీసు క్యాంపులు, వారి లైంగిక వేధింపులతో అక్కడి ఆదివాసీ స్త్రీలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. అయి నా వారి భూముల కోసం ధైర్యంగా పోరాడు తూనే ఉన్నారన్నారు.

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం ప్రజాస్వామిక హక్కుల సమన్వయ సంస్థ దశాబ్ది ఉద్యమ అఖిల భారత సదస్సు జరిగింది. సీనియర్‌ జర్నలిస్టు రత్నమాల అధ్యక్షతన ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా నిర్వహిం చిన ఈ సదస్సులో సోనీసోరి మాట్లాడారు. బుర్కాపాల్‌లో 40 మంది మగవారిని పోలీసు లు ఇళ్ల నుంచి పట్టుకుపోయి, వారిపై మావో యిస్టులంటూ కేసులు బనాయించి, జైల్లో పెట్టారన్నారు. వీరిలో ఏడుగురి జాడ లేదన్నా రు. మగవారు జైలు పాలవ్వడంతో ఇప్పుడు ఆ భూములు దున్నుకుంటున్న స్త్రీలను పోలీసులు కొట్టి, లైంగిక దాడులతో వేధిస్తున్నారన్నారు. ఊర్లన్నీ తగులబెట్టి, ఆదివాసీలను పిట్టలను కాల్చినట్టు కాల్చి ఇప్పుడు నక్సలైట్లతో శాంతి చర్చలంటూ ప్రభుత్వం దొంగ మాటలు చెబుతోందని సోనీసోరి ఆరోపించారు.

చేయని నేరానికి ఏడేళ్ల జైలు...
నా చెల్లెళ్లకు గోరింటాకు పెడుతుంటే హఠాత్తుగా పోలీసు లు వచ్చి నన్ను పట్టుకుపోయారు. చెల్లెళ్లతో పాటు, అక్కడున్న పిల్లలు భయంతో పరుగులు పెట్టారు. 20 రోజులు పోలీస్‌ స్టేషన్‌లో నిర్బంధించి, చిత్రహింసలు పెట్టి, అత్యాచారం చేశారు. చేయని నేరానికి ఏడేళ్లు నన్ను జైల్లో పెట్టారు. అక్కడ నా లాంటి వారెందరో ఉన్నారు. మావోయిస్టులనే ముద్ర వేసి అత్యాచారాలు చేస్తున్నారు.
– హిడిమె, దంతెవాడ ఆదివాసీ, ఛత్తీస్‌గఢ్‌

పాత్రికేయులపై దాడులు
అక్కడ జరుగుతున్న వాస్త వాలను వెలికితీయాలని చూస్తున్న పాత్రికేయులపై దాడులకు తెగబ డుతున్నారు. బస్తర్‌లో పాత్రికేయు లు, హక్కుల నేతలను  అక్రమంగా జైలుపాలు చేస్తున్నారు. ఏ చట్టా లూ అక్కడ పనిచేయవు. ఆదివాసీలకు రక్షణా లేదు.
– మాలిని సుబ్రహ్మణ్యం, పాత్రికేయురాలు

మిలిటరీ పాలన...
ఛత్తీస్‌గఢ్‌లో మానవహక్కు లను అణచివేస్తూ మిలిటరీ పాలన సాగిస్తున్నారు. అత్యాచారాలు అక్కడ నిత్యకృత్యం. పాల్‌నార్‌ లోని గురుకుల పాఠశాలలో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు పోలీసు అధి కారుల సమక్షంలోనే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడ్డారంటే అక్కడ పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. – బేలా భాటియా, సామాజిక కార్యకర్త

ప్రశ్నించడమే మహానేరం
అడుగంటిపోతోన్న పౌరహ క్కుల గురించి ప్రశ్నించడమే ఛత్తీస్‌ గఢ్‌లో మహానేరం. ప్రశ్నిస్తే ఏం చేయడానికైనా సైన్యం, పోలీసులు వెనుకాడరు. అక్కడ జరుగుతున్న అత్యాచారాలు, ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ ఘోరాలు వెలికితీసేందుకు వెళ్లిన నిజనిర్ధారణ కమిటీవారిని, హక్కుల నేతలను నిర్బంధించారు.
– చిలుకా చంద్రశేఖర్, సీఎల్‌సీ ఏపీ నాయకుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement