నిజామాబాద్ అర్బన్: పదోన్నతులు, బదిలీలపై ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఉపాధ్యాయులు నిరాశ చెందుతున్నారు. దసరా సెలవులలో ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు, పదోన్నతులు, రేషనలైజేషన్ ఉంటాయ ని విద్యాశాఖ అధికారులు గతంలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను కూడా అందించింది. అయితే, మరింత విశ్లేషణ చేసి పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించినట్టు తెలిసింది. దీంతో బదిలీలు, పదోన్నతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఇదీ పరిస్థితి
జిల్లాలో 463 ఉన్నత పాఠశాలలు, 973 ప్రాథమిక పాఠశాలలు, 753 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దాదాపు పది వేల మందికి పైగా ఉపాధ్యాయులు ఉన్నారు. వీరందరూ బదిలీలు, పదోన్నతుల కోసం గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నారు. ఇందుకు సం బంధించిన నియమ నిబంధనలు ఎలా ఉం టాయోనని ఆందోళన చెందుతున్నారు. ఓ ప్రాంతంలో ఐదు సంవత్సరాల పదవీ కాలం ముగిసిన ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ అవుతారు.
ఈ మేరకు సుమారు ఆరు నుంచి ఏడు వేల మంది బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. మూడు సంవత్సరాలు దాటిన ప్రధానోపాధ్యాయులకు స్థాన చలనం కలుగవచ్చు. వీరు కూడా దాదాపు మూడు వేల మంది ఉంటారని భావిస్తున్నా రు. జిల్లాలో 30 మంది ఉపాధ్యాయులకు ప దోన్నతులు లభించవచ్చు. వీరంతా ఇదివరకే తమకు అనుకూలమైన ప్రాంతాలను అన్వే షించుకున్నారు.
కానీ, సర్కారు నుంచి ఎలాం టి ఆదేశాలు రాకపోవడంతో నిరాశలో ముని గిపోయారు. ముఖ్యంగా సర్వీస్ రూల్స్ వివా దం బదిలీలు, పదోన్నతులకు అడ్డుగా మారిం దని తెలుస్తోంది. ఇందులో మార్పులు, చేర్పు లు చేసిన తరువాతనే షెడ్యూల్‌లు విడుదలయ్యే అవకాశం ఉందని జిల్లా అధికారులు చెబుతున్నారు.
సార్ల కోసం పిల్లలు
రేషనలైజేషన్ జరుగుతుందన్న విద్యాశాఖ ప్ర కటనతో ఉపాధ్యాయులు ఆత్మ రక్షణలో పడిపోయారు. 20 మంది విద్యార్థుల కంటే తక్కువగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను తొల గిం చనున్నారు. దీంతో పాఠశాలలు, తమ పోస్టు లు తరలిపోకుండా ఆయా పాఠశాలలలో ఉన్న ఉపాధ్యాయులు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాది కూడా ఎక్కువ మం దిని విద్యార్థులను చూపి పాఠశాల, పోస్టులు తరలిపోకుండా కాపాడుకున్నారు.
ఇందులో నిజామాబాద్ మండలం సారంగాపూర్, కం జర, మోర్తాడ్ మండలంలోని నాలుగు పాఠశాలలు, దోమకొండ మండలంలోని రెండు పాఠశాలలు, బాన్సువాడలోని ఆరు పాఠశాల లు ఉన్నాయి. జుక్కల్, బిచ్కుంద, మద్నూరు మం డలాలలో మాత్రం కావాలనే విద్యార్థుల సంఖ్యను తక్కువగా చూపిస్తున్నారు. మారుమూల ప్రాంతాలు కావడంతో ఇక్కడ విధులు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు విముఖ త చూపుతున్నట్టు తెలుస్తోంది.
మూసివేత తప్పదా?
ఈ ఏడాది రేషనలైజేషన్‌లో భాగంగా 30 ప్రాథమిక పాఠశాలలు, 55 ఉన్నత పాఠశాలలను మూసివేసే అవకాశం ఉన్నట్లు తెలి సింది. ఏదేమైనా బదిలీలు, పదోన్నతులకు సంబంధించిన విధి విధానాల నివేదిన ప్రభుత్వానికి అందేందుకు మరో రెండు నెలలు పట్టవచ్చని సమాచారం.
ఏమో... ఏమవునో!
Published Fri, Sep 26 2014 2:56 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement