స్ట్రెచర్‌పై నాలుగు కిలోమీటర్లు...
ఉట్నూర్ రూరల్: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించేందుకు నాలుగు కిలోమీటర్లు స్ట్రెచర్‌పై మోసి మానవత్వం చాటుకున్నాడో వైద్యుడు. ఆస్పత్రిలో ఆడశిశువుకు జన్మనిచ్చింది ఆ తల్లి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి జెండాగూడ గ్రామానికి చెం దిన ఆత్రం అయ్యుబాయికి గురువారం పురిటినొప్పులు వచ్చాయి. అంగన్‌వాడీ కార్యకర్త ఆత్రం మల్కుబాఇయ సమాచారం మేరకు దంతన్‌పల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి కిరణ్ వెంటనే అక్కడికి వచ్చారు. గ్రామ సమీపంలో వాగు ఉంది. రోడ్డు సరిగా లేక వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది.
దీంతో వైద్యుడు కిరణ్, గ్రామ ఉపాధ్యాయుడు నగేశ్, ఏఎన్‌ఎం పావని, హెల్త్ అసిస్టెంట్ జాన్, అయ్యుబాయి భర్త బీర్‌చావ్, తల్లి సిడాం మింగుబాయి ఆమెను జెండాగూడ నుంచి తాటిగూడ వర కు 4 కిలోమీటర్లు స్ట్రెచర్‌పైనే మోసుకొచ్చారు. మధ్యలో నడుం లోతుతో ప్రవహిస్తున్న వాగునూ దాటారు. అనంతరం అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.