
కోలాట బృందం
సప్తగిరికాలనీ(కరీంనగర్): జనజానపద వృత్తి కళాకారుల సమాఖ్య కోలాట బృందానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం లభించింది. కరీంనగర్ జిల్లాకు చెందిన ఈ కోలాట బృందం 1,500 మంది మహిళలతో కరీంనగర్ పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో గురువారం పది నిమిషాలపాటు కోలాటం చేసింది.
దీంతో వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో బృందం పేరు నమోదైంది. కోలాట బృందానికి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ భారత ప్రతినిధి బింగి నరేందర్‌గౌడ్, జిల్లా ప్రతినిధి విజయభాస్కర్ సర్టిఫికెట్ ప్రదానం చేశారు. జిల్లాకు చెందిన జానపద కళాకారుల ప్రతినిధులు ఇస్మాయిల్, కృపాదానంల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment