కరీంన గర్ ఎడ్యుకేషన్ : ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యూరుు. సోమవారం ప్రారంభం కానున్న పరీక్షలు ఈ నెల 25 వరకు జరగనున్నారుు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతించేది లేదని ఇంటర్‌బోర్డు ప్రకటించింది. జిల్లాలో 132 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు 8.30 గంటలకే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. 8.45 వరకు పరీక్ష హాల్‌లోకి అనుమతిస్తారు. పరీక్షకేంద్రాల్లో గ్లోబల్ పొజిషన్ సిస్టమ్(జీపీఎస్) అందుబాటులోకి తీసుకువచ్చి మాస్‌కాపీరుుంగ్‌ను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఈ విధానం ద్వారా పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల దూరం పరిధిలో వినియోగించే సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ సమాచారం పూర్తిగా రికార్డు కానుంది. సంక్షిప్త సందేశాల సమాచారం కూడా ఏ ఫోన్ నుంచి వెళ్లిందనేది కంట్రోల్ రూంలో ఎప్పటికప్పుడు నమోదవుతుంది. ప్రశ్నపత్రాలు తరలించే వాహనాలకు సైతం ట్రాలీ ట్యాగ్‌లు ఏర్పాటు చేయడంతో వాహనం ఎప్పుడు బయలుదేరింది? ఎక్కడ ఎంతసేపు ఆగింది? వాహనంలో ఏఏ విషయూలు మాట్లాడారనే పూర్తి సమాచారం నమోదవుతుంది. ఈ మేరకు పరీక్షలకు సంబంధించి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు, స్క్వాడ్ సిబ్బందికి సంబంధించిన అన్ని సెల్‌ఫోన్, ల్యాండ్‌ఫోన్ నంబర్లను జిల్లా ఇంటర్మీడియెట్ అధికారులు ఇంటర్ విద్యామండలికి పంపించారు.
మొత్తం 132 పరీక్ష కేంద్రాల్లో 56 ప్రభుత్వ కళాశాలలు, 56 ప్రైవేట్ అన్‌ఎరుుడెడ్ సంస్థలు, 11 ఆదర్శపాఠశాలలు, 4 సాంఘిక సంక్షేమ, 1 గిరిజన సంక్షేమ, 4 సహకార జూనియర్ కళాశాలల్లో పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నారు. 141 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 141 మంది డిపార్ట్‌మెంటల్ అధికారులను నియమించారు. 6 ఫ్లరుుంగ్ స్క్వాడ్ బృందాలు, ప్రతీ 25 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. మొత్తం 1,01,396 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షల సందర్భంగా విద్యార్ధులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా 0878-2241215, 9848309006 నంబర్లలో సంప్రదించాలని అధికారులు సూచించారు.
విజయోస్తు
Published Mon, Mar 9 2015 2:22 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement