
తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ, కాంగ్రెస్ లొల్లి
హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు శనివారం ప్రారంభమైయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగిస్తున్నారు. ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించడం తనకు సంతోషంగా ఉన్నారు. గోల్కోండ కోటపై జెండా ఎగురవేయడం ప్రజల ఆకాంక్షగా నిలిచిందన్నారు.
గవర్నర్ ప్రసంగిస్తుండగానే కాంగ్రెస్, టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. ప్రతిపక్షాల నిరసనల నడుమ ఆయన ప్రసంగం కొనసాగుతోంది. విపక్ష సభ్యులు గవర్నర్ పై కాగితాలు విసిరేసి నిరసన తెలిపారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. గవర్నర్ సాక్షిగా అధికార, విపక్ష సభ్యులు బాహాబాహికి దిగారు.