ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి | tdp demands to take actions on party changed MLAs | Sakshi
Sakshi News home page

ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోండి

Published Thu, Apr 30 2015 3:43 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

tdp demands to take actions on party changed MLAs

- స్పీకర్‌ను కోరిన టీటీడీపీ నేతలు
 
 హైదరాబాద్:
తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ ఎస్. మధుసూదనాచారికి టీడీపీ విజ్ఞప్తి చేసింది. పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు ఎల్.రమణ, టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, జి.సాయన్న, మాగంటి గోపీనాథ్, ప్రకాశ్‌గౌడ్, వివేకానంద, కృష్ణారావు, గాంధీ తదితరులు బుధవారం మధ్యాహ్నం అసెంబ్లీలో స్పీకర్‌ను కలసి, పార్టీ ఫిరాయింపుదారులపై అనర్హత వేటు వేసే అంశంపై చర్చించి, పార్లమెంటరీ సంప్రదాయాన్ని కాపాడాలని కోరారు.

అనంతరం టీడీఎల్‌పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మీడియాతో మాట్లాడుతూ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేం దర్‌రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం పార్లమెంటరీ సంప్రదాయాలకు విరుద్ధమన్నారు. టీడీఎల్‌పీ ఉపనేత రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఎంపీగా జీతం తీసుకుంటున్న కడియం శ్రీహరి రాష్ట్ర మంత్రిగా ఇక్కడి సౌకర్యాలు ఎలా పొందుతారని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement