బుల్లెట్‌పై యువతుల ఫోజు
కేపీహెచ్‌బీకాలనీ: గ్లోబలైజేషన్‌తో ప్రపంచం కుగ్రామంగా మారిందని, విద్యార్థుల్లోని సృజనాత్మకతను ప్రపంచానికి పరిచయం చేసేందుకు సాంకేతిక ఉత్సవాలు దోహపడతాయని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. జేఎన్‌టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో సాంకేతిక ఉత్సవాలు బుధవారం వర్శిటీ ఆడిటోరియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరిగే ఈ సంబరాల ప్రారంభోత్సవానికి నేషనల్ ఇన్సూరెన్స్ ఇండియా చీఫ్ జనరల్ మేనేజర్ ఎన్.ఎల్. వెంకటరావు, జిటాటెక్ అధినేత ఆర్.శివకుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
చీర కట్టు.. అదిరేట్టు.. కంప్యూటర్ సైన్స్ విద్యార్థినులు..
ప్రిన్సిపల్ ఇ.సాయిబాబారెడ్డి, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావుతో కలిసి వారు వేడుకను ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ విద్యార్థులు తమ చదువులు పూర్తికాగానే ఎంటర్‌ప్రెన్యూర్‌లుగా ఎలా ఎదగాలో ముందుగానే అవగాహన పెంచుకోవాలన్నారు. ఈ జాతీయ విద్యార్థి సదస్సుల్లో చేపట్టే కార్యక్రమాల ప్రోమోలను ప్రారంభోత్సవ వేడుకలో ప్రదర్శించారు. కాగా సివిల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్, మెటలర్జీ, కెమికల్, మేనేజ్‌మెంట్ విద్యార్థులు వేడుకలో విభిన్నంగా సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment