'పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి' | Telanagana Government Asked High Court To Investgate Tenth Exams Litigation | Sakshi
Sakshi News home page

'పదో తరగతి పరీక్షల వ్యాజ్యంపై విచారణ చేపట్టండి'

Published Fri, May 15 2020 12:52 PM | Last Updated on Fri, May 15 2020 1:16 PM

Telanagana Government Asked High Court To Investgate Tenth Exams Litigation - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో నిర్వహించాల్సిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఈ మేరకు ప్రభుత్వం తరపున అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హైకోర్టును కోరారు. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని ప్రసాద్‌ పేర్కొన్నారు. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణకు సంబంధించిన చర్యలను ప్రభుత్వం చేపడుతుందని వెల్లడించారు. అన్ని వాదనలు విన్న హైకోర్టు ఈ నెల 19న పదో తరగతి వ్యాజ్యం విచారణ చేపడతామని స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement