ఐలమ్మ విగ్రహానికి నిప్పు
Published Mon, Mar 23 2015 7:27 AM | Last Updated on Sat, Sep 2 2017 11:16 PM
దుండగుల చర్యతో
దెబ్బతిన్న విగ్రహం
ఆగ్రహించిన రజక, ప్రజాసంఘాల నాయకులు
అలంపూర్ : అలంపూర్ పట్టణంలోని ప్రధాన కూడలిలో ఉన్న తెలంగాణ పో రాట యోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహానికి గుర్తు తెలియని దుండగులు నిప్పుపెట్టారు. ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్న విగ్రహం ఇలా తగలబడిపోవడం తో ప్రజాసంఘాలు, రజక, అన్ని పార్టీల నాయకులు ఆగ్రహం వ్యక్తంచేస్తూ వేర్వేరుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. శనివారం రాత్రి దుండగలు పని కట్టుకొని ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారు. ఆది వారం విషయం అందరికి తెలియడంతో వివిధ ప్రజా సంఘాలు, ఆయాపార్టీల నాయకులు ఆందోళనకు దిగారు. ఇటీవలే రజక సంఘం నాయకులు చందాలు వేసుకొని ఐలమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఎన్నికల కోడ్ కారణంగా ఆవిష్కరణ వచ్చే నెలకు వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసి ముసుగు వేసి ఆవిష్కరణకు సిద్ధం చేసి ఉంచారు. శనివారం రాత్రి విగ్రహం దగ్దం కావడంతో జీర్ణించుకోలేని రజకు లు ఆందోళనబాట పట్టారు. వారికి ప్రజా సంఘాలు, ప్రజాప్రతినిధులు, పార్టీల నాయకులతో సంఘీభావం తెలిపారు. అందరు మూకుమ్మడిగా ర్యాలీ నిర్వహించి విగ్రహం ఎదుట నిరసన తెలి పారు. అనంతరం సీఐ వెంకటేశ్వర్లుకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. స్థానిక తహశీల్దార్ మంజుల, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ పర్వతాలు వివరాలను సేకరించారు. నిరసనలో రజక ఉద్యోగ సంఘం జిల్లా సహాయ కార్యదర్శి నరసింహులు, రజకసంఘం గౌరవ అధ్యక్షుడు శేషన్న, అధ్యక్షుడు శాలన్న, నాయకులు వేణు, వెంకటేశ్వర్లు, రంగన్న, ఇందిరమ్మ, మగమ్మ, వెంకటరంగమ్మ, రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.
హేయమైన చర్య : ఎమ్మెల్యే
అయిజ : తెలంగాణ తల్లి విగ్రహాన్ని కూల్చివేయడం, చాకలి ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టడం లాంటి సంఘటనలు అమానుషమని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ ఖండించారు. ఆదివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవలే అయిజలో తెలంగాణ చౌరస్తాలో తెలంగాణతల్లి విగ్రహాన్ని రాజకీయాల గ్రూపు తగాదాలదాడిలో కూల్చివేసిన సంఘటన మరిచిపోకముందే అలంపూర్‌లో చాకలి ఐలమ్మ విగ్రహానికి నిప్పుపెట్టారని ఆవేదన చెందారు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్ నాయకులతోపాటు అన్నిపార్టీల నాయకులు, అన్ని సంఘాల నాయకులు పాల్గొన్నారని, తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు.
Advertisement