జోగినపల్లి విగ్రహావిష్కరణ | Telangana armed fighter joginapalli statue discovered | Sakshi
Sakshi News home page

జోగినపల్లి విగ్రహావిష్కరణ

Published Thu, Oct 15 2015 1:28 PM | Last Updated on Sun, Sep 3 2017 11:01 AM

Telangana armed fighter joginapalli statue discovered

కరీంనగర్ : తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే జోగినపల్లి ఆనందరావు స్మారక స్థూపాన్ని ఆయన స్వగ్రామంలో గురువారం ఆవిష్కరించారు.  బోయిన్‌పల్లి మండలం మాన్వాడ గ్రామంలో స్థానికులు చందాలతో ఆనందరావు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే బొడిగె శోభ తదితరులు పాల్గొన్నారు. ఆనందరావు 1950-60 మధ్యకాలంలో సిరిసిల్ల,  మెట్‌పల్లి నియోజకవర్గాలకు ఎమ్మెల్యేగా పనిచేశారు. జిల్లాలో మంచి ప్రజానాయకుడిగా గుర్తింపు ఉంది. ఈ సందర్భంగా నేతలు ఆయన సేవలను కొనియాడారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement