10మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
హైదరాబాద్ : తెలంగాణ టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ వేటు పడింది. బడ్జెట్ సమావేశాల నుంచి పదిమంది తెలంగాణ టీడీపీ సభ్యులను స్పీకర్ మధుసూదనాచారి సోమవారం సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయినవారిలో 1) ఎర్రబెల్లి దయాకరరావు, 2) రేవంత్ రెడ్డి, 3) గోపీనాథ్, 4) రాజేందర్ రెడ్డి, 5) సాయన్న, 6) సండ్ర వీరయ్య, 7) మాధవరం కృష్ణారావు, 8) వివేకానంద, 9) ప్రకాష్ గౌడ్, 10) గాంధీ మోహన్ ...ఉన్నారు. బడ్జెట్ సమావేశాలు ముగిసేవరకూ వీరిపై సస్పెన్షన్ కొనసాగనుంది. కాగా సస్పెన్షన్ నుంచి ఆర్.కృష్ణయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి మినహా మిగతా టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
కాగా అంతకు ముందు జాతీయ గీతాన్ని అవమానపరిచిన సభ్యులు బేషరతుగా క్షమాపణ చెప్పాలని అంతకు ముందు మంత్రి హరీష్ రావు సూచించారు. అయితే వారు క్షమాపణ చెప్పేందుకు నిరాకరించటంతో పాటు సభలో ఆందోళన కొనసాగిస్తుండటంతో టీడీపీ సభ్యులను సమావేశాల నుంచి సస్పెండ్ చేయాలని హరీష్ రావు తీర్మానం ప్రవేశపెట్టారు. దాన్ని స్పీకర్ ఆమోదించారు. అయితే సభ నుంచి సస్పెండ్ అయినా కూడా టీడీపీ సభ్యులు మాత్రం స్పీకర్ పోడియం వద్ద తమ నిరసన కొనసాగిస్తున్నారు.