
సాక్షి, న్యూఢిల్లీ: ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో తెలంగాణకు ‘అత్యంత మెరుగైన పెద్ద రాష్ట్రం’ అవార్డు దక్కింది. గురువారం ఇక్కడ జరిగిన ఇండియాటుడే కాంక్లేవ్‌లో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా సీఎం కేసీఆర్ తరఫున తెలంగాణ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ అశోక్‌కుమార్ ఈ అవార్డును అందుకున్నారు. రాష్ట్రానికి అవార్డు రావడం సంతోషకరమని, గతేడాది రాష్ట్రంలోని పాలనను పరిగణనలోకి తీసుకుని అవార్డు ఇచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment