15న సంజయ్‌ బాధ్యతలు | Telangana BJP Chief Sanjay Meets Amit Shah And JP Nadda | Sakshi
Sakshi News home page

15న సంజయ్‌ బాధ్యతలు

Published Fri, Mar 13 2020 3:34 AM | Last Updated on Fri, Mar 13 2020 5:29 AM

Telangana BJP Chief Sanjay Meets Amit Shah And JP Nadda - Sakshi

అమిత్‌ షా, నడ్డాతో సంజయ్‌. చిత్రంలో కిషన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ ఈ నెల 15న బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ కార్యాలయంలో రాష్ట్ర పార్టీ నేతల సమక్షంలో బాధ్యతలు చేపట్టనున్నా రు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన ఆదివారం మధ్యాహ్నం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు. తర్వాత నాంపల్లిలోని బీజేపీ కార్యాలయానికి భారీ ర్యాలీతో రానున్నారు.

అమిత్‌ షా, నడ్డాలను కలిసిన సంజయ్‌.. 
బండి సంజయ్‌ గురువారం పార్లమెంట్‌లోని కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బీజేపీని అధికారంలో కి తీసుకువచ్చేందుకు మరింతగా కష్టపడాలని అమిత్‌ షా రాష్ట్ర నేతలకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement