వచ్చేవారం తెలంగాణ కేబినెట్ విస్తరణ
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రవర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వచ్చేవారం తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. ఈసారి మంత్రివర్గంలో ఓ మహిళతో పాటు అయిదుగురికి చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణపై కేసీఆర్ జిల్లాల వారీగా సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం టీ. కెబినెట్లో ముఖ్యమంత్రితో కలిపి 12మంది ఉన్నారు. మరో ఆరుగురిని కేబినెట్‌లోకి తీసుకోవడానికి వీలుంది.
ఐదుగురితోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని, కొంతకాలం తర్వాత మరొకరికి మంత్రిగా అవకాశమివ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం విస్తరణ నేపథ్యంలో ఆశావహుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. రెండు, మూడేళ్లు నిరీక్షించి ఆ తర్వాత మంత్రివర్గంలో చోటు కోరుదామనుకున్నవారు కూడా ఈ విస్తరణలోనే అవకాశం కోరుతున్నారు.