హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటి మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ భేటీలో 12 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం.
ఈ భేటీలో ప్రధానంగా డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ఉద్యోగ నోటిఫికేషన్లు, పారిశ్రామిక విధానం, పోలీసు అమర వీరులకు పరిహారం పెంపు, హరితహారం మొదలైన అంశాలపై చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది.