
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రగతి భవన్‌లో జరగనుంది. కరోనా(కోవిడ్-19) పరిస్థితులపై కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్‌ను పొడగించే అంశం, తెలంగాణ ఆర్థిక పరిస్థితులు, భవిష్యత్ రూపకల్పన, వలస కార్మికుల అంశంపై చర్చ జరగనుంది. అదేవిధంగా వ్యవసాయం కొనుగోళ్లు, వడగండ్ల వాన నష్టంపై ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇక తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 471కి చేరుకుంది. ఇప్పటివరకు 45 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా, 12 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 6,725కు చేరుకుంది. ఇప్పటివరకు 635 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 5,863 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment