తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే
ఎక్కడైనా బావ గానీ, వంగతోట వద్ద మాత్రం కాదంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తమ్ముడు తమ్ముడే.. పేకాట పేకాటే అన్నట్లు కేసీఆర్ పేకాటరాయుళ్లపై ఎలాంటి జాలి చూపించటం లేదు. తనకు తెలిసినవాళ్లు అయినా సరే ఏమాత్రం ఊరుకోవట్లేదు. తెలంగాణలో పేకాట అనే మాట వినిపించకూడదని కేసీఆర్ గతంలోనే పోలీసులకు స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే.
హైదరాబాద్లో అయితే ఏకంగా పేకాట క్లబ్బులనే ఆయన మూయించేశారు. పేకాట క్లబ్లులకు తిరిగి అనుమతి ఇవ్వాలని సొంతపార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఎంతగా అంటే పోలీసులకు దొరికిపోయిన పేకాట రాయుళ్లు టీఆర్ఎస్ నేతలతో చెప్పించినా పోలీసుల దగ్గర నుంచి వారు 'సారీ కాంట్ హెల్ప్' అనే సమాధానమే ఎదురవుతోంది.
తాజాగా కేసీఆర్కు తనకు తెలిసిన వారి నుంచి ఫోన్ వచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన తమవారిని విడిచి పెట్టాల్సిందిగా సదరు ఫోన్ చేసిన వ్యక్తి ఆయనను కోరాడు. ఎందుకు అరెస్ట్ అయ్యారో అని సీఎం ఆరా తీయగా... పేకాడుతూ పట్టుబడినట్లు చెప్పాడు. పేకాట బ్యాన్ చేశాం కదా, ఎందుకు ఆడుతున్నారని ఆయన అడగగా, టైమ్ పాస్ కోసం అని అవతలి వ్యక్తి సమాధానం ఇచ్చాడు దాంతో చిర్రెత్తిన కేసీఆర్... టైమ్ పాస్కి క్యారమ్స్ ఆడతారు కానీ పేకాట కాదని ... సారీ ఐ విల్ నాట్ రిలీజ్ దెమ్ అంటూ పోన్ పెట్టేశారట. మరి కేసీఆరా.. మజాకానా?