
సాక్షి, హైదరాబాద్: కోవిడ్–19 కేసులపై డిపార్ట్‌మెంట్‌లో ఎవరూ మాట్లాడవద్దని ముఖ్యంగా మీడియాతో అసలు చర్చించవద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గత 50 రోజులుగా లాక్‌డౌన్ కారణంగా.. జనసంచారం లేకపోవడం, అంతా ఇళ్లకే పరిమితమవడంతో రాష్ట్రంలో నేరాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. మర్కజ్ లింకులు, ఇక్కడి నుంచి వలస కూలీలను పంపడం, రాష్ట్రానికి వచ్చిన వలస కూలీల గుర్తింపు వరకు పోలీసులు అన్నీ తామై వ్యవహరించారు. కేంద్ర– రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌కు మెజారిటీ ప్రాంతాల్లో మినహాయింపులు ఇచ్చాయి. మరోవైపు నేరాలు, దోపిడీలు, రోడ్డు ప్రమాదాలు, హత్యలు, దొంగతనాల కేసులు కూడా పెరుగుతున్నాయి. ఇకపై కరోనాతోపాటు సాధారణ నేరాల నియంత్రణకు కృషి చేయాలని డీజీపీ ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment