
బంధువులతో ముచ్చటిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి
ఖమ్మంక్రైం: రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి శుక్రవారం రాత్రి ఖమ్మం వచ్చారు. నగరంలోని ముస్తఫానగర్ లక్ష్మి గార్డెన్స్‌లో ఆళ్లఫక్కిరెడ్డి మనవరాళ్ల ఓణీల కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఫక్కిరెడ్డి డీజీపీకి చిన్ననాటి స్నేహితులతో పాటు బంధువు కూడా కావడంతో హాజరై..మనవరాళ్లను ఆశ్వీరదించారు. ప్రైవేట్ కార్యక్రమం కావడంతో ఈయన రాకను పోలీసులు గోప్యంగా ఉంచారు.
ముందుగా పోలీస్ క్లబ్‌కు చేరుకోగా..పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ మర్యాద పూర్వకంగా కలిశారు. సీపీ వెంట అడిషనల్ డీసీపీ సురేష్‌కుమార్ ఇతర పోలీస్ అధికారులు ఉన్నారు. డీజీపీని ఫంక్షన్‌హాల్‌లో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ కార్యాలయ ఇన్‌చార్జ్ దయాకర్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు తుమ్మా అప్పిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు సాధు రమేష్‌రెడ్డి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment