ఏడు మండలాల ఉద్యోగులు తెలంగాణకే | Telangana employees only in seven zones | Sakshi
Sakshi News home page

ఏడు మండలాల ఉద్యోగులు తెలంగాణకే

Published Thu, Mar 5 2015 4:13 AM | Last Updated on Thu, Sep 6 2018 3:01 PM

Telangana employees only in seven zones

హైదరాబాద్: రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఏపీలో కలసిన ఏడు ముంపు మండలాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను తెలంగాణ పరిధిలో చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వారిని తెలంగాణ ఉద్యోగులుగా పరిగణించే ఫైలుపై సీఎం కె.చంద్రశేఖరరావు బుధవారం సంతకం చేశారు. ఇటీవల ఆ ప్రాంతంలో పనిచేస్తున్న ఉద్యోగులు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు సారథ్యంలో సీఎంను కలిసి.. తమను తెలంగాణలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement