సెప్టెంబర్లోగా కొత్త రుణాలు | Telangana governmentt to waive new crop Loans on september | Sakshi
Sakshi News home page

సెప్టెంబర్లోగా కొత్త రుణాలు

Published Wed, Jul 30 2014 12:51 PM | Last Updated on Mon, Oct 1 2018 2:03 PM

సెప్టెంబర్లోగా కొత్త రుణాలు - Sakshi

సెప్టెంబర్లోగా కొత్త రుణాలు

కరీంనగర్: రుణమాఫీపై రైతులకు ఆందోళన వద్దని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కొత్త రుణాలు సెప్టెంబర్లోగా ఇస్తామని ఆయన బుధవారమిక్కడ తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని పోచారం స్పష్టం చేశారు.  కాగా ఎస్ఐబీ (పాత స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో) భవనం ఫర్నిచర్ లూటీపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తామూ కూడా అలా చేస్తే సీమాంధ్ర కార్యాలయాల్లో ఒక్కటి కూడా మిగలదని పోచారం వ్యాఖ్యానించారు.

కాగా పాత స్పెషల్ ఇంటెలిజెన్ఓస్ బ్యూరో కార్యాలయంలో లక్షల  విలువైన ఫర్నీచర్ మాయమైన విషయం తెలిసిందే. ఫర్నీచర్తో పాటు ఏసీలు, ట్యూబులైట్లు, స్విచ్ బోర్డులు, ఫ్యూజుల, తలుపులు, కిటీల ఫ్రేములతో పాటు వాష్ బెసిన్లు, టాయిలెట్ ఫ్లష్లతో సహా మాయం చేశారు. ఈ ఘటనపై పోచారం పైవిధంగా స్పందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement