తెలంగాణలో ‘బాబు’ దుకాణం బంద్ | Telangana In the 'Babu' shop Bandh | Sakshi
Sakshi News home page

తెలంగాణలో ‘బాబు’ దుకాణం బంద్

Published Tue, Feb 24 2015 12:36 AM | Last Updated on Sat, Jul 28 2018 4:52 PM

తెలంగాణలో ‘బాబు’ దుకాణం బంద్ - Sakshi

తెలంగాణలో ‘బాబు’ దుకాణం బంద్

జగదేవ్‌పూర్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు శకం తెలంగాణ రాష్ట్రంలో  ముగిసిందని, ఆయన ఎన్ని పర్యటనలు చేపట్టినా ఫలితం లేదని  ఎక్సైజ్ శాఖ మంత్రి టి. పద్మారావు పేర్కొన్నారు. సోమవారం మండలంలోని కొండపోచమ్మ అమ్మవారిని ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజురోజుకు టీడీపీ  అవుతోందన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం కేసీఆర్ ప్రజాహితమే లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. రూ.వేల కోట్లతో మిషన్ కాకతీయ పథకాన్ని అమలు చేస్తున్నామని,  ఇప్పటి వరకు ప్రభుత్వం ప్రారంభించిన పథకాలన్నీ విజయవంతమయ్యాయన్నారు.  రాష్ట్రం సుభిక్షంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు.  వచ్చే ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవాలని, రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని కొండపోచమ్మ తల్లికి మొక్కుకున్నట్లు చెప్పారు. ఆలయ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు యాదవరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, యాదగిరి, హన్మంతరెడ్డి, సర్పంచ్ మల్లయ్య, వెంకటేశం తదతరులు పాల్గొన్నారు.
 
అమ్మవారి సన్నిధిలో మంత్రి
కొండపోచమ్మ అమ్మవారి ఉత్సవాల్లో సోమవారం మంత్రి పద్మారావు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ సిబ్బంది మంత్రికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈఓ శ్రీనివాస్‌రెడ్డి మంత్రి కుటంబ సభ్యులను ఘనంగా సన్మానించారు. కొండపోచమ్మ తల్లిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు మంత్రి చెప్పారు.
 
తరలివస్తున్న భక్తులు

- కొండపోచమ్మ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా సోమవారం భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న భక్తజనం సోమవారం ఉదయమే కొండపోచమ్మ దర్శనం కోసం బయలుదేరారు.
- భక్తులు సంప్రదాయ పరంగా కుండల్లో అమ్మవారికి నైవేద్యం వండి డప్పు చప్పుళ్ల మధ్య పోతరాజుల ఆటపాటలు, శివసత్తుల శిగాలతో అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. కొండపోచమ్మ తల్లికి నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. సోమవారం  సుమారు 10 వేలకు మందికి పైగా భక్తులు అమ్మవారి సన్నిధికి తరలివచ్చినట్లు ఆలయ సిబ్బంది తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement