తెలంగాణ జీసీసీ తొలి యాక్షన్‌ప్లాన్
రూ. 150 కోట్లతో ప్లాన్ సిద్ధం చేసిన మంత్రి చందూలాల్
హైదరాబాద్: తెలంగాణ గిరిజన సహకార సంస్థ(జీసీసీ) 2015-16కు సంబంధించి రూ.150 కోట్ల ప్రతిపాదనలతో తొలి కార్యాచరణ ప్రణాళికను గిరిజన సంక్షేమశాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ విడుదల చేశారు. రాష్ర్టంలోని 4 ఐటీడీఏల పరిధిలోని 18 సొసైటీ కార్యాలయాల ద్వారా ఆయా కార్యకలాపాలను నిర్వహించనున్నారు.
ఉట్నూరు ఐటీడీఏ పరిధిలోని 6 సొసైటీల ద్వా రా రూ.48 కోట్లు, ఎటూరునాగారం ఐటీడీఏ పరిధిలోని 4 సొసైటీల ద్వారా రూ.45 కోట్లు, భద్రాచలం ఐ టీడీఏ పరిధిలోని 6 సొసైటీల ద్వారా రూ. 44 కోట్లు, మన్ననూరు ఐటీడీఏ పరిధిలోని 2 సొసైటీల ద్వారా రూ. 12 కోట్ల మేర కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రతిపాదనలిచ్చారు.