మంత్రులకు బుల్లెట్ప్రూఫ్ కార్లు! | telangana ministers allotted bullet proof vehicles with maoist threat | Sakshi
Sakshi News home page

మంత్రులకు బుల్లెట్ప్రూఫ్ కార్లు!

Published Tue, Nov 18 2014 4:09 PM | Last Updated on Tue, Oct 9 2018 2:38 PM

మంత్రులకు బుల్లెట్ప్రూఫ్ కార్లు! - Sakshi

మంత్రులకు బుల్లెట్ప్రూఫ్ కార్లు!

తెలంగాణ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మావోయిస్టుల కదలికలు ఉన్నాయంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో కొంతమంది మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూరుస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు.. జిల్లాల పర్యటనలలో కూడా తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మాత్రమే వాడాలని పోలీసులు మంత్రులకు స్పష్టంగా సూచించారు.

ఉప ముఖ్యమంత్రి రాజయ్య, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ.. పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె. తారక రామారావు, ఇతర మంత్రులకు బుల్లెట్ప్రూఫ్ స్కార్పియో వాహనాలు సమకూర్చాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement