Bullet Proof Vehicles
-
ఆ రెండు కార్ల ఖరీదే రూ.20 కోట్లు - అట్లుంటది అంబానీ ఫ్యామిలీ అంటే..
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ దేశంలో ఖరీదైన అన్యదేశ కార్లను కలిగి ఉంది. గతంలో వీరు చాలా సందర్భాల్లో తమ లగ్జరీ కార్లలో కనిపించారు. తాజాగా మరో సారి ఇలాంటి సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో గమనించినట్లయితే.. అంబానీ ఫ్యామిలీ ఓ గుడికి మెర్సిడెస్ బెంజ్, బెంట్లీ కార్లలో వెళ్లినట్లు తెలుస్తోంది. ఇందులో ముఖేష్ అంబానీ, నీతా అంబానీ, వారి కొడుకు అనంత్ అంబానీ బయటకు రావడం చూడవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న మెర్సిడెస్ బెంజ్ ఎస్ 680 గార్డ్ గోల్డెన్ షేడ్‌లో కనిపిస్తోంది. మరోక బెంజ్ ఎస్ 680 కారు కలర్ స్పష్టంగా కనిపించడం లేదు, బహుశా ఇది మాట్టే సిల్వర్ షేడ్ పొందినట్లు తెలుస్తోంది. ఈ రెండు కార్లు అత్యాధునిక భద్రతలను పొందినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఇన్ని రకాల లోన్స్ ఉన్నాయా - లిస్ట్ చూస్తే అవాక్కవుతారు! నిజానికి ముఖేష్ అంబానీకి కట్టుదిట్టమైన భద్రతలు కల్పించడంలో భాగంగా ఏ మెర్సిడెస్ బెంజ్ కార్లను చాలా పటిష్టంగా తయారు చేశారు. అంబానీకి కుటుంబానికి రక్షణ కవచంగా ఉపయోగపడే ఈ కార్లు దాదాపు 2 టన్నుల బరువు కలిగి ఉంటాయి. ఇవి 3.5 నుంచి 4 ఇంచెస్ మందం గల బుల్లెట్ ప్రూఫ్ మల్టీ-లేయర్ గ్లాస్, స్ప్లింటర్ రక్షణ కోసం పాలికార్బోనేట్ లేయర్ పొందాయి. ఈ సెడాన్‌లోని ఒక్కో డోర్ బరువు సుమారు 250 కేజీల వరకు ఉంటుంది. వీటి ఒక్కక్క ధర రూ. 10 కోట్లు వరకు ఉంటుందని అంచనా. -
పాక్‌లోని చైనీయులకు బులెట్ ప్రూఫ్ కార్లు.. ‘ఇమ్రాన్’ కాల్పులే కారణమా?
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో టెర్రరిస్టు దాడులు పెరిగిపోతుండటంపై ఆందోళన పడుతోంది చైనా. చైనా-పాకిస్థాన్ సంయుక్తంగా చేపట్టిన ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ)లో పని చేస్తున్న తమ దేశీయుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సీపెక్ ప్రాజెక్టులో పని చేస్తున్న చైనీయుల కోసం బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌పై ఇటీవల కాల్పులు జరిగిన గంటల వ్యవధిలోనే ఈ నిర్ణయం తీసుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇమ్రాన్ ఖాన్ ఘటనతో చైనా అప్రమత్తమైనట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా కార్మికులకు భద్రత కల్పించటం డ్రాగన్‌కు తలనొప్పిగా మారింది. ప్రాజెక్టుల వద్ద భద్రత బలగాలు, దర్యాప్తు దళాలను బలోపేతం చేసేందుకు అంగీకరించినట్లు సీపెక్‌కు చెందిన 11వ జాయింట్ కోఆపరేషన్ కమిటీ(జేసీసీ) తెలిపింది. ‘ప్రాజెక్టుల్లో పని చేస్తున్న చైనా ఉద్యోగులు బయటకి పనుల కోసం వెళ్లేందుకు బులెట్ ప్రూఫ్ వాహనాలు ఉపయోగించాలని నిర్ణయించారు.’అని వెల్లడించింది. పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ ఇటీవలే చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా పాక్‌లో పని చేస్తున్న తమ ఉద్యోగుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్. బులెట్ ప్రూఫ్ వాహనాలు వినియోగించాలని నిర్ణయించటం చైనా ఆందోళనలను పరిగణనలోకి తీసుకున్నట్లయిందని పాక్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇదీ చదవండి: ఆ వీడియోని చూసి...కన్నీళ్లు పెట్టుకున్న పాక్ నాయకుడు -
జగన్‌కు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలతో కాన్వాయ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టనున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రభుత్వం కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. తాత్కాలిక కాన్వాయ్‌గా ఏపీ18పీ3418 నంబర్‌తో ఆరు కొత్త వాహనాలను సమకూర్చారు. బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలతో కూడిన నూతన వాహనశ్రేణి శుక్రవారం జగన్మోహన్రెడ్డి నివాసం వద్దకు చేరుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని, చుట్టుపక్కల ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాడేపల్లి ప్రాంతంలో పోలీసులు భద్రతాపరమైన ఆంక్షలను అమల్లోకి తీసుకొచ్చారు. జగన్మోహన్రెడ్డికి వ్యక్తిగత భద్రతా సిబ్బందిని ఇప్పటికే పెంచిన సంగతి తెలిసిందే. జగన్‌కు ‘జెడ్’ కేటగిరీ భద్రత కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ‘జెడ్’ కేటగిరీ భద్రత కల్పించినట్టు రాష్ట్ర శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్ చెప్పారు. తాడేపల్లిలోని జగన్ నివాసం వద్ద భద్రతాపరమైన అంశాలను ఆయన శుక్రవారం పరిశీలించారు. జగన్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామని తెలిపారు. శనివారం తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశం సందర్భంగా భారీ భద్రత ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఆరు ప్లాటూన్ల బలగాలను ఏర్పాటు చేశామని రవిశంకర్ వెల్లడించారు. -
మంత్రులకు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు!
-
మంత్రులకు బుల్లెట్‌ప్రూఫ్ కార్లు!
తెలంగాణ మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ కార్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మావోయిస్టుల కదలికలు ఉన్నాయంటూ నిఘా వర్గాలు హెచ్చరించడంతో కొంతమంది మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సమకూరుస్తున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు.. జిల్లాల పర్యటనలలో కూడా తప్పనిసరిగా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను మాత్రమే వాడాలని పోలీసులు మంత్రులకు స్పష్టంగా సూచించారు. ఉప ముఖ్యమంత్రి రాజయ్య, హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ.. పంచాయతీరాజ్ శాఖల మంత్రి కె. తారక రామారావు, ఇతర మంత్రులకు బుల్లెట్‌ప్రూఫ్ స్కార్పియో వాహనాలు సమకూర్చాలని నిర్ణయించారు. -
225 మందికి భద్రత తొలగింపు
* ఏపీ భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం * 20 మందికి కుదింపు.. కొత్తగా 50 మందికి కేటాయింపు * నక్సల్స్ కదలికలు ఉన్నాయంటూ ప్రజాప్రతినిధుల ఆందోళన సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 225 మందికి కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 20 మందికి కల్పిస్తున్న భద్రతను తగ్గించింది. కొత ్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులకు అవసరమైన, నిర్దేశిత స్థాయిలో భద్రత కల్పిం చారు. వివిధ కేటగిరీల్లో ప్రముఖులతో పాటు ఇతరులకు కల్పిస్తున్న భద్రతను ఉన్నతస్థాయి భద్రతా సమిష్టి కమిటీ సమీక్షించింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 50 మందికి కేటాయించింది. పలువురు ప్రముఖులకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను వెనక్కు తీసుకున్నారు. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ముప్పు పొంచి ఉన్న వారు మినహా మిగిలిన వారి వద్ద ఉన్న గన్‌మెన్‌ను తక్షణం వెనక్కు పిలిపించారు. వ్యాపార, పారిశ్రావేత్తలు, రాజకీయ నాయకుల్లో అనేక మందికి ఉన్న ఎస్కార్టు, గార్డుల్ని తొలగించారు. రాష్ట్రంలో మావోల ప్రభావం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. నల్లమల పరిధిలోని గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మావోలు ప్రజాప్రతినిధులపై దాడులకు దిగటంతో అప్పట్లో చాలా మంది నేతలకు గన్మెన్లను ఇచ్చారు. మావోల కదలికలు మళ్లీ కనిపిస్తుండటంతో భద్రత తొలగించిన ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.