* ఏపీ భద్రతా సమీక్ష కమిటీ నిర్ణయం
* 20 మందికి కుదింపు.. కొత్తగా 50 మందికి కేటాయింపు
* నక్సల్స్ కదలికలు ఉన్నాయంటూ ప్రజాప్రతినిధుల ఆందోళన
సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి దాదాపు 225 మందికి కల్పిస్తున్న భద్రతను ఉపసంహరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో 20 మందికి కల్పిస్తున్న భద్రతను తగ్గించింది. కొత ్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు, మంత్రులకు అవసరమైన, నిర్దేశిత స్థాయిలో భద్రత కల్పిం చారు. వివిధ కేటగిరీల్లో ప్రముఖులతో పాటు ఇతరులకు కల్పిస్తున్న భద్రతను ఉన్నతస్థాయి భద్రతా సమిష్టి కమిటీ సమీక్షించింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారిలో దాదాపు 50 మందికి కేటాయించింది. పలువురు ప్రముఖులకు కేటాయించిన బుల్లెట్ ఫ్రూఫ్ వాహనాలను వెనక్కు తీసుకున్నారు.
మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ముప్పు పొంచి ఉన్న వారు మినహా మిగిలిన వారి వద్ద ఉన్న గన్‌మెన్‌ను తక్షణం వెనక్కు పిలిపించారు. వ్యాపార, పారిశ్రావేత్తలు, రాజకీయ నాయకుల్లో అనేక మందికి ఉన్న ఎస్కార్టు, గార్డుల్ని తొలగించారు. రాష్ట్రంలో మావోల ప్రభావం తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్తున్నారు. నల్లమల పరిధిలోని గుంటూరు జిల్లా పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో మావోలు ప్రజాప్రతినిధులపై దాడులకు దిగటంతో అప్పట్లో చాలా మంది నేతలకు గన్‌మెన్‌లను ఇచ్చారు. మావోల కదలికలు మళ్లీ కనిపిస్తుండటంతో భద్రత తొలగించిన ప్రజాప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
225 మందికి భద్రత తొలగింపు
Published Wed, Aug 13 2014 1:06 AM | Last Updated on Sat, Aug 18 2018 8:49 PM
Advertisement
Advertisement