విజయవాడ: హైదరాబాద్ నుంచి అమరావతికి తరలి వెళ్లే ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30శాతం హెచ్‌ఆర్‌ఏ పెంచింది. దీనికి సంబంధించి మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది. ఈ 30 శాతం పెంపు ఏడాది పాటు అమల్లో ఉండనుంది. గరిష్టంగా రూ.20వేలు లేదా 30 శాతం హెచ్ఆర్ఏను వర్తింపు చేయనున్నారు.
కాగా హైదరాబాద్‌లో ప్రస్తుతం ఉద్యోగులకు 30 శాతం ఇంటి అద్దెభత్యం(హెచ్‌ఆర్‌ఏ) ఇస్తున్నారు. విజయవాడలో 20 శాతం, అమరావతిలో 12 శాతం హెచ్‌ఆర్‌ఏ వస్తుంది. తరలివెళ్లే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏలో కోత పడకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. హెచ్ఆర్ఏను పెంపుపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు ఈ నెల 27లోపు ఉద్యోగులంతా అమరావతికి వెళ్లాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే.