
తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి
హైదరాబాద్: ఈ నెల 29 నుంచి టీవీ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయని వస్తోన్న వార్తలు అసత్యమని తెలంగాణ ఎంఎస్‌ఓల సంఘం అధ్యక్షుడు సుభాష్ రెడ్డి తెలిపారు. బ్రాడ్‌కాస్టర్లకు, ఎంఎస్‌ఓలకు ఎలాంటి నోటీసులు, ఉత్తర్వులు రాలేదని స్పష్టం చేశారు. ట్రాయ్ అవలంబిస్తోన్న విధానాలు మారాలని డిమాండ్ చేశారు. ఎంఎస్‌ఓలు, కేబుల్ ఆపరేటర్ల అభిప్రాయం తెలుసుకోకుండా ధరలు నిర్ణయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పే ఛానళ్లపై పెంచిన ధరలను రద్దు చేయాలని కోరారు. అలాగే కేబుల్ ఛార్జీలపై జీఎస్టీని 18 నుంచి 5 శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment