![Telangana Woman Speaks In G20 - Sakshi](/styles/webp/s3/article_images/2019/07/2/japn.jpg.webp?itok=mzwWrxts)
హైదరాబాద్: ప్రపంచ దేశాలన్నీ సభ్యులుగా ఉన్న కూటమి అది. ఈ కూటమి నిర్వహించిన సదస్సులో హైదరాబాద్‌కు చెందిన తెలుగుతేజం షర్మిలా సిసుధాన్ ప్రసంగించారు. భారత్ నుంచి ఇటువంటి అద్భుతమైన అవకాశం అందుకున్న ఒకే ఒక మహిళ కావటం గమనార్హం. జపాన్‌లో ఇటీవల జరిగిన జీ–20 సమ్మిట్ షర్మిల...‘‘ప్రపంచ సుస్ఠిరాభివృద్ధి – లక్ష్యాలు – ఆహారోత్పత్తి , వినియోగం ’’ అనే అంశంపై ఆమె మాట్లాడారు. షర్మిల స్వస్థలం హైదరాబాద్‌లోని మణికొండ. తండ్రి సుధాకర్‌రావు వైద్యుడు. హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో పోషక విలువలపై షర్మిల గతంలో అధ్యయనం చేశారు. బెంగుళూరులోని ఐటీసీ హోటల్‌లో పనిచేశారు.
ఢిల్లీలోని రాయ్ విశ్వవిద్యాలయంలో హాస్పిటాలిటీ అండ్ టూరిజం కాలేజ్ అధ్యాపకురాలిగా చేరి, తర్వాత అదే కాలేజ్ డీన్ స్థాయికి ఎదిగారు. గురుగ్రామ్ క్యాంపస్‌కు అసోసియేషన్ డైరెక్టర్‌గా ఎన్నికయ్యారు. ఇదిలాఉంచితే వరల్డ్ ఇటాలజీ ఫోరంను జపాన్‌కు చెందిన గంగ్విలివ్ అనే వ్యక్తి ప్రారంభించాడు. ఆహార ప్రమాణాలే ప్రాతిపదికగా ఈ సంస్థ పనిచేస్తుంది. ఈ ఫోరంను యూఎన్ సస్టెయినబుల్ కౌన్సిల్‌లో భాగం చేశారు. ఈ ఐరాస కౌన్సిల్ ద్వారానే జీ–20 సదస్సులో పాల్గొనే అవకాశం షర్మిలకు దక్కింది. దీంతో ఆమె పేరు మార్మోగిపోతోంది.
Comments
Please login to add a commentAdd a comment