రాష్ట్రపతి వద్దకు‘భూసేకరణ’ బిల్లు | Telangana's land Bill reaches Pranab Mukherjee | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి వద్దకు‘భూసేకరణ’ బిల్లు

Published Wed, May 10 2017 1:55 AM | Last Updated on Tue, Sep 5 2017 10:46 AM

Telangana's land Bill reaches Pranab Mukherjee

సాక్షి, న్యూఢిల్లీ:
తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లును కేంద్ర హోం శాఖ రాష్ట్రపతి ఆమోదానికి సిఫారసు చేసింది. ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి కేంద్రానికి పంపగా కేంద్రం పలు సవరణలు సూచించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్‌ 30న ఇందుకు సంబం ధించి ఐదు సవరణలను రాష్ట్ర శాసనసభ, శాసనమండలి ఆమోదించాయి.

శీర్షికలో మార్పులు, అమలు తేదీ, మార్కెట్‌ ధరకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలన్న క్లాజు రద్దు, ప్రభావిత కుటుంబాల్లోని వ్యవసా య కూలీలకు తగిన పరిహారం చెల్లింపు, తదితర సవరణలు ఈ బిల్లులో ఉన్నాయి. దీనికి కేంద్ర న్యాయ శాఖ ఆమోద ముద్ర వేసి హోం శాఖకు పంపింది. దీంతో ఈ సవరణ బిల్లు ఆమోదానికి కేంద్ర హోంశాఖ సిఫారసు చేస్తూ సోమవారం రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement