
సభను పక్కదోవ పట్టిస్తున్న అధికార పక్షం
హైదరాబాద్: అధికారపక్షం శాసనసభను పక్కదోవ పట్టిస్తోందని టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం మీడియాపాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్యతో కలసి మాట్లాడారు. ప్రతిప్రక్షాలను మాట్లాడనీయకుండా గొంతు నొక్కుతున్నారని, నిలదీస్తే బయటికి గెంటేస్తున్నారని చెప్పారు. కేసీఆర్ కుటుంబం ఒంటెద్దుపోకడలకు పోతోందని, ఆయన కుమారుడు కేటీఆర్ అన్నీ తానై నడి పిస్తున్నారని విమర్శించారు.