
అర్వపల్లి: అమెరికా కాంగ్రెస్ ఎన్నికల్లో తెలుగు వ్యక్తి పోటీ పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రానికి చెందిన ప్రవాస భారతీయుడు ఆలూరు బంగార్‌రెడ్డి అమెరికా సంయుక్త రాష్ట్రాల (యూఎస్‌ఏ) కాంగ్రెస్‌కు టెక్సాస్ రాష్ట్రంలోని టెక్సాస్ 22 స్థానానికి (మన దేశంలో లోకసభ స్థానంతో సమానం) డొనాల్డ్ ట్రంప్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. కాగా ఆ దేశంలో ఎన్నికల్లో పోటీకి ముందు సంబంధిత పార్టీ నిర్వహించే ఎన్నికల్లో గెలవాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది అమెరికాలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో భాగంగానే రిపబ్లికన్ పార్టీ తరఫున అభ్యర్థిత్వం కోసం బంగార్‌రెడ్డి నామినేషన్ వేశారు. జాజిరెడ్డిగూడేనికి చెందిన ఆలూరి రామచంద్రారెడ్డి–సక్కుబాయమ్మల కుమారుడు బంగార్‌రెడ్డి 25 ఏళ్ల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి అక్కడే టెక్సాస్ రాష్ట్రంలోని హ్యూస్టన్ నగరంలో స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment