
నల్లగొండ జిల్లాలో ఉద్రిక్తత!
నల్లగొండ: టీఆర్ఎస్ తీరును నిరసిస్తూ టీడీపీ చేపట్టిన నల్లగొండ జిల్లా బంద్ ఉద్రిక్తతకు దారి తీసింది. నల్లగొండకు వస్తున్న టిడిపి నేతలు ఎర్రబెల్లి దయాకర రావు, ఇతర నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
నల్లగొండలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై టీఆర్ఎస్ కార్యకర్తలు మంగళవారం దాడి చేసి, దానిని తగులబెట్టిన విషయం తెలిసిందే. ఇందుకు నిరసన తెలుపుతూ టిడిపి నేతలు ఈ రోజు జిల్లా బంద్కు పిలుపు ఇచ్చారు. బంద్లో పాల్గొనడానికి వస్తున్న నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
**