జాగృతి డిగ్రీ కళాశాలలో విత్‌హెల్డ్ రిజల్ట్
ఆందోళనకు దిగిన విద్యార్థులు
ధర్మసాగర్ : యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ధర్మసాగర్‌లోని జాగృతి డిగ్రీ కళాశాల విద్యార్థుల ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉంచారు. మూడేళ్ల క్రితం మండల కేంద్రంలో ఆర్ట్స్ గ్రూపులైన బీకాం జనరల్, బీకాం కంప్యూటర్స్, బీఏ గ్రూపులతో జాగృతి డిగ్రీ కళాశాలను స్థాపించా రు. ఈ విద్యా సంవత్సరం ప్రథమ సంవత్సరంలో 58 మంది, ద్వితీయ సంవత్సరంలో 45, తృతీయ సంవత్సరంలో 45 మంది విద్యార్థులు చదువుతున్నారు. కాగా ఇటీవల కాకతీయ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో ఈ కళాశాలకు చెందిన విద్యార్థులందరి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచారు. తమ ఫలితాలు ఇంటర్నెట్‌లో విత్‌హెల్డ్ రాగా కళాశాల యాజ మాన్యాన్ని నిలదీశారు. దీంతో చిన్న పొరపాటు వల్ల ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉంచారని, వారం రోజుల్లో ఫలితాలు నేరుగా కళాశాలలోనే వెల్లడి స్తామని వారు సమాధానం చెప్పారు. కాగా విద్యార్థులు సోమవారం తమ ఫలితాల కోసం కళాశాలకు చేరుకొని ఆందోళనకు దిగారు.
కాగా కళాశాల యాజమాన్యం చేసిన పొరపాటు తో తాము విద్యాసంవత్సరాన్ని కోల్పోవాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వక్తం చేశారు. ఈ విషయంపై కళాశాల ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.వెంకటేశ్వర్లును వివరణ కోరగా పరీక్ష ఫీజు చెల్లిస్తున్న సమయంలో అందించాల్సిన విద్యార్థుల నామినల్ రోల్స్‌ను పదిరోజులు ఆలస్యంగా అందించడం వల్లే ఫలితాలు విత్‌హెల్డ్‌లో ఉంచినట్లు తెలిపారు. ఇన్‌స్టంట్ పరీక్షకు అవకాశం ఉన్న ఇద్దరు విద్యార్థుల ఫలితాలను యూనివర్సిటీ అధికారులు వెల్లడించి వారికి సమాచారం అందించారని చెప్పారు. జరిగిన పొరపాటుకు తగిన ఫైన్ చెల్లించి విద్యార్థుల ఫలితాలు వెల్లిండించేలా చూస్తామని తెలిపారు.
రీ కౌంటింగ్ అవకాశం కోల్పోయూ
కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంతో రీకౌంటింగ్ అవకాశాన్ని కోల్పోయాను. ఫస్టియర్, సెకండియర్‌లో ఒక్క సబ్జెక్ట్ కూడా ఫెయిల్ కాలేదు. ఫైనల్ ఇయర్‌లో ఒక సబ్జెక్ట్ ఫెరుులయ్యూనని కళాశాల యాజమాన్యం ఇటీవలే సమాచారం అందించింది. దీంతో రీకౌంటింగ్ అవకాశాన్ని కోల్పోయాను. - గోగుల లావణ్య, ఫైనల్ ఇయర్ విద్యార్థి
ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు
జాగృతి డిగ్రీ కళాశాలలో సరైన వసతులు, ఫ్యాకల్టీ లేదని మేనేజ్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. డిగ్రీ కళాశాలను నామమాత్రంగా నడిపిస్తూ, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ప్రత్యేక కేటగిరిగా పరిగణించాలి. - రజాక్, ఫైనల్ ఇయర్ విద్యార్థి