టీఆర్‌ఎస్ పతనం ఆరంభం
రాష్ట్రంలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదన్నారు. ఏఐసీసీ అధినేత సోనియా దయతో ఏర్పడిన తెలంగాణను తన కుటుంబ స్వార్థం కోసం వాడుకుంటున్న కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలే గుణపాఠం చెప్పాలన్నారు. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు రెండు లక్షల రుణమాఫీ , సమభావన సంఘాలకు ఎన్ని లక్షలకైనా వడ్డీ లేని రుణాలు, నిరుద్యోగులకు నెలకు రూ. 3వేల నిరుద్యోగ భృతి, లక్షలాది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేస్తామని హామీ ఇచ్చారు. సాగర్ ఎడమ కాల్వను ఎండబెట్టిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. రూ. 500 కోట్లతో హైదరాబాద్‌లో ఇల్లు నిర్మించుకున్న కేసీఆర్.. పేదలకు ఇందిరమ్మ బిల్లులు కూడా చెల్లించలేని దౌర్భాగ్యస్థితిలో ఉన్నాడన్నారు.