మడికొండ : ద్విచక్ర వాహనం తాళం చెవి ఇవ్వలేదని పురుగుల మందు తాగి బాలుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హన్మకొండ మండలంలోని ముల్కలగూడెంలో మంగళవారం జరిగింది. స్థానికులు, గ్రామస్తుల కథ నం ప్రకారం.. హన్మకొండ మండలం ముల్కలగూడెం గ్రామానికి చెందిన ఎండిగ రవీందర్‌కు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు మహేష్(13) ఉన్నారు. మంగళవారం ఉదయం మహేష్ తన తండ్రి రవీందర్‌ను బైక్ నడుపుతానని తాళం చెవి ఇవ్వమని కోరాడు. తండ్రి తాళం చెవి ఇవ్వకపోవడంతో కలతచెందిన మహేష్ ఇంట్లో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి రవీందర్‌కు సమాచారమిచ్చి ఎంజీఎం ఆస్పత్రికి తరలిచగా చికిత్సపొందుతు మృతిచెందాడు. మహేష్ చురుగ్గా ఉండేవాడని స్థానికులు తెలిపారు. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
బైక్ ఇవ్వలేదని బాలుడి ఆత్మహత్య
Published Wed, Oct 8 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM
Advertisement
Advertisement