
'ఓటరు జాబితా ప్రచురణ గడువు పెంచాలి'
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు సంబంధించిన ఓటరు జాబితా తుది ప్రచురణ గడువు పెంచాలని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ముఖ్యనేతలతో శనివారం గాంధీభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. అనంతరం ఈ సమావేశం వివరాలను సీనియర్ నేత మర్రి శశిధర్‌రెడ్డి మీడియాకు వివరిస్తూ, ఓటరు లిస్టును మరోసారి పరిశీ లించి, తుది జాబితాను సిద్ధం చేయడానికి ఇచ్చిన సమయాన్ని పెంచాలని కోరుతూ పీసీసీ అధ్యక్షుడు ఈసీకి లేఖరాస్తారని వెల్లడించారు.
కాగా, అంబేడ్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఈనెల 12న పీసీసీ నిర్వహించనున్న కార్యక్రమాలకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్, ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొప్పుల రాజు హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
ఎన్‌ఎస్‌యూఐ ఆవిర్భావ దినోత్సవం
కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్‌ఎస్‌యూఐ 46వ ఆవిర్భావ దినోత్సవం శనివారం గాంధీభవన్‌లో జరిగింది. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు.