మణుగూరు మండలం పగిడేరు పంచాయతీ గొల్లకొత్తూరులో సోమవారం విద్యుద్ఘాతంలో పూరిల్లు దగ్ధమయింది. అదే సమయంలో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడా లీకవడంతో సామాను అంతా కాలిబూడయి పోయింది. సుమారు రూ.లక్ష ఆస్తి నష్టం సంభవించినట్లు యజమాని కావేటి వెంకయ్య తెలిపారు. ఇంటి యజమాని పొలం పనుల్లో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇల్లు పూర్తిగా దగ్ధమైన తర్వాత ఫైరింజన్లు వచ్చాయి.